Nellore: నెల్లూరు కార్పొరేషన్ 21వ డివిజన్‌లో జనసేన-కూటమి ప్రచారం జోరు!
Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 21వ డివిజన్‌లో జనసేన నేతలు కిషోర్, విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అడిగారు.
Nellore: నెల్లూరు కార్పొరేషన్ 21వ డివిజన్‌లో జనసేన-కూటమి ప్రచారం జోరు!
Nellore: పేద పిల్లలకు ఉచిత కార్పొరేట్ విద్య, ఆటపాటలకు పార్కులు, క్రీడలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పొంగూరు నారాయణ గారు చారిత్రాత్మక శ్రమ చేస్తున్నారు... పెట్టుబడులు రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు సాగుతున్న చంద్రబాబు నాయుడు గారు.
దేశానికి గర్వకారణంగా పరిపాలన అందిస్తూ, సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సకాలంలో నిధులు అందిస్తూ, అభివృద్ధికి అండగా నిలుస్తూ, నమ్మకమంటే ఇదేనని చూపిస్తున్న నరేంద్ర మోదీ గారు.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో *21వ డివిజన్ (పాత 16వ డివిజన్)*లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం కొనసాగింది.
ఆదిత్య నగర్ ఏరియా పరిసరాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలుసుకుని, స్థానిక సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ అంశాలపై వివరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జనసేనాని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.
పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో విద్య, పార్కులు, క్రీడా సదుపాయాలు మరియు నగర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి మద్దతుగా, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు.
ప్రచారంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల, ప్రశాంత్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, కుమారి, ప్రవళ్లిక, విజయ, కృష్ణవేణి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




