Nellore: జనసేన కమిటీల నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలి

Nellore: నెల్లూరు టౌన్ హాల్‌లో జనసేన పార్టీ కమిటీల నిర్మాణ సారథుల సమాచార సేకరణ సమావేశం ఘనంగా జరిగింది.

V. Narasimhulu, Nellore
Published on: 2 July 2026 8:20 AM IST
Nellore
X

Nellore: జనసేన కమిటీల నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలి

Nellore: పదేళ్ల క్రితం మన సమస్యలపై మనలా ఆలోచించి పోరాడే నాయకుడు వచ్చాడని నమ్మిన సామాన్యులకి నేడు రాజకీయ అవకాశాలు అందిస్తూ పవన్ కళ్యాణ్ ఒక నూతన అధ్యాయాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు కిషోర్ గునుకుల.

జనసేన పార్టీ నిర్మాణ సారదుల సమాచార సేకరణ సమావేశం,టౌన్ హాల్ నెల్లూరులో కిషోర్ గునుకుల జనసేన తనకు గుర్తింపు నిచ్చిందని చెప్పారు... పవన్ కళ్యాణ్ తనకు అతిపెద్ద కుటుంబాన్ని ఇచ్చారని చెప్పారు. 2020 లో క్రియాశీలక సభ్యత్వం పైలట్ ప్రాజెక్ట్‌లో రూ.500 సభ్యత్వ రుసుము అడిగితే కొందరు ఎగతాళి చేశారని, ఆధార్ కార్డు అడిగితే భయపడ్డారని, కానీ ప్రమాదవశాత్తు ఒక కార్యకర్త మరణించినప్పుడు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించినపుడు, పవన్ కళ్యాణ్ స్థానిక నాయకుల తలపై కిరీటం పెట్టినట్లుగా అనిపించిందని చెప్పారు.

జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేసిన సేవే... తనకు జిల్లా హద్దులు దాటి గుర్తింపును తీసుకొచ్చిందని అన్నారు. మాటలు చెప్పే నాయకులు చాలామందే ఉన్నారని... మాట నిలబెట్టుకునే నాయకుడు మాత్రం పవన్ కళ్యాణ్ అని అన్నారు. "మనతో కలిసి నడిచిన జనసైనికుడే నేడు నర్సాపురం ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా ఉన్న బొమ్మిడి నాయకర్ అని, ఆయన ఎదుగుదల ప్రతి జనసైనికుడికి స్ఫూర్తి అని చెప్పారు.

జిల్లా లో గాజు గ్లాస్ గుర్తుపై మొట్ట మొదటిసారిగా గెలిచిన ఎంపీటీసీ సాధం మౌనిక ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురైనా, జనసేన సిద్ధాంతాలపై నిలిచి పవన్ కళ్యాణ్ ఎంత మొండిగా తన సిద్ధాంతాల కోసం నిలబడతారో జనసైనికులు కూడా అంతే పట్టుదలతో పార్టీ కోసం నిలబడతారు అని నిరూపించారని చెప్పారు.

"గెలుపు–ఓటములతో సంబంధం లేకుండా తనతో పాటు నడిచిన ప్రతి జనసైనికుడి గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ గర్వంగా మాట్లాడుతుంటారని చెప్పారు. నెల్లూరు టౌన్ హాల్‌లో జనసేన పార్టీ కమిటీల నిర్మాణ సారదుల సమాచార సేకరణ కార్యక్రమం సందర్భంగా, జిల్లా అబ్జర్వర్ నర్సాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, మత్స్యకారుల అభివృద్ధి కమిటీ చైర్మన్ బొమ్మిడి నాయకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల మాట్లాడుతూ... జనసేన పార్టీ కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పారదర్శకమైన వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు.

పవన్ కళ్యాణ్ జనసైనికులకు అపారమైన గౌరవాన్ని ఇచ్చారని, అతిపెద్ద కుటుంబంగా జనసేనను నిర్మించారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నర్సాపురం పర్యటనలో నాయకర్ చూపిన ఆదరణను ఎప్పటికీ మరచిపోలేమన్నారు.

జనసేన ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదుడుకులు, దాడులు, ఎన్నికలను ప్రత్యక్షంగా చూసినా పార్టీని వీడకుండా సేవ చేయడం గర్వకారణమన్నారు. గత పది సంవత్సరాలుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వివిధ స్థాయిల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసిన అనుభవాన్ని గుర్తు చేశారు.

ప్రారంభంలో క్రియాశీలక సభ్యత్వం కోసం రూ.500 చెల్లించాలని చెప్పినప్పుడు చాలామంది ఎగతాళి చేశారని, కానీ నేడు అదే సభ్యత్వ విధానం లక్షలాది మందిని జనసేనతో అనుసంధానించిందన్నారు. సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా అందించడం జనసేన కార్యకర్తల పట్ల పార్టీకి ఉన్న బాధ్యతను చాటిచెప్పిందని పేర్కొన్నారు.

జనసేన కోసం నిస్వార్థంగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు కమిటీల్లో అవకాశం కల్పించే ప్రక్రియ కొనసాగుతోందని, అందరూ సమాచార సేకరణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాటలు చెప్పే నాయకులు చాలామందే ఉన్నా, మాట నిలబెట్టుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు.

బొమ్మిడి నాయకర్ కూడా ఒక సాధారణ జనసైనికుడిగా ప్రారంభించి నేడు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా, మత్స్యకారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఎదగడం ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఇలాంటి నాయకులు జనసేన నుంచి మరెందరో తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

విభేదాలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని, రాబోయే తరం జనసేనదేనని అన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

సామాన్యుడికి సమస్యలపై పోరాడే ధైర్యం, ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తిని పవన్ కళ్యాణ్ ఇచ్చారని పేర్కొంటూ, సంక్షేమం–అభివృద్ధి సమపాళ్లలో అందించే ప్రభుత్వానికి ప్రతి జనసైనికుడు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story