Nellore: కూటమి ప్రభుత్వ అభివృద్ధికి ప్రజల మద్దతు..విజయలక్ష్మి గునుకుల!

Nellore: నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్. కూటమి సంక్షేమ పథకాలపై ఇంటింటి ప్రచారం.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 22 Sept 2026 12:13 PM IST
Nellore
X

Nellore: కూటమి ప్రభుత్వ అభివృద్ధికి ప్రజల మద్దతు..విజయలక్ష్మి గునుకుల!

Nellore: కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని జనసేన వీరమహిళ, ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి గునుకుల అన్నారు.

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 16,( 21)వ డివిజన్లలో “అభివృద్ధి అడుగులు – సంక్షేమ వెలుగులు” అనే నినాదంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో భాగంగా సోమవారం డివిజన్‌లోని రామజీనగర్, ఆదిత్యనగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయలక్ష్మి గునుకుల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు అందించాలని కోరారు.

"ప్రజా సంక్షేమానికి పవన్ కళ్యాణ్ కృషి"

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రంగాల్లో మౌలిక వసతులు, తాగునీరు, గ్రామీణ ఉపాధి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల గోదావరి పుష్కరాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు తదితర మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

"నెల్లూరు నగర అభివృద్ధికి నారాయణ కృషి"

పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ నేతృత్వంలో నగర మౌలిక వసతులు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, పార్కులు, పట్టణ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి కొనసాగుతోందని విజయలక్ష్మి తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

నెల్లూరులో ప్రభుత్వ విద్యా మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా RSR మున్సిపల్ హైస్కూల్‌ను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడం కూడా నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఒక ఉదాహరణగా నిలుస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. తమ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తమ మద్దతును తెలియజేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ, ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి గునుకుల,నరహరి, ప్రవళ్ళిక, హర్ష, శివ, విజయ, అశోక్, ఆమని, బాలాజీ కృష్ణవేణి, లత, శారద, బిందు, కల్పన, అరవింద్, కృష్ణారెడ్డి,పవన్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE