Nellore: నెల్లూరులో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జనసేన ప్రచారం!

Nellore: నెల్లూరు 16వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల గెలుపునకు జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల గడపగడప ప్రచారం.. పవన్ కళ్యాణ్ ఆశయాలపై అవగాహన.

A Praveen, Nellore
Published on: 12 Sept 2026 7:06 AM IST
Nellore
X

Nellore: నెల్లూరులో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జనసేన ప్రచారం!

Nellore: నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ (కొత్త 20వ డివిజన్) పరిధిలో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జనసేన పార్టీ వీరమహిళ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఆదిత్యనగర్ మొదటి వీధి, గుర్రాలమడుగు సమీప ప్రాంతాలతో పాటు డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ప్రతి గడపను తట్టి ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన, అవినీతి రహిత రాజకీయాల ఆశయాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే జనసేన లక్ష్యమని విజయలక్ష్మి గునుకుల పేర్కొన్నారు.

నెల్లూరు నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో నగరం అభివృద్ధి పథంలో వేగంగా పయనిస్తోందని ఆమె తెలిపారు.

“నెల్లూరు సిటీని రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్న మంత్రి పొంగూరు నారాయణ గారి సంకల్పానికి, ప్రజా సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న మార్గానికి ప్రజల సహకారం అవసరం. స్థానిక సంస్థల్లో కూటమిని మరింత బలోపేతం చేసి, తలారావు డివిజన్ అభివృద్ధికి కూటమి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి” అని విజయలక్ష్మి గునుకుల ప్రజలను కోరారు.

కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ కూటమి అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళ నెల్లూరు ఎఎంసి డైరెక్టర్ విజయలక్ష్మి, ప్రవల్లిక,విజయలక్ష్మి,సునీత,సుప్రియా,స్వప్న,ప్రశాంత్ గౌడ్, కృష్ణారెడ్డి, మల్లిరెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore