Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో ఉత్సాహంగా జనసేన ఇంటింటి ప్రచారం!
Nellore: నెల్లూరు నగరంలోని 21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల గెలుపు కోరుతూ జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది.
Nellore: నెల్లూరు 21వ డివిజన్‌లో ఉత్సాహంగా జనసేన ఇంటింటి ప్రచారం!
Nellore: నెల్లూరు నగరంలోని 21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని జనసేన పార్టీ ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ప్రతి గడపను ఆప్యాయంగా పలకరిస్తూ కొనసాగుతున్న ప్రచారం ఇప్పటికే వెయ్యికి పైగా గడపలను దాటింది.
జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రచారంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, యువత భవిష్యత్తు మరియు రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన వసతులు, పేద పిల్లలకు పార్కులు–ఆటస్థలాలు, మహిళలకు ఆర్థిక స్వావలంబన, యువతకు వ్యాపార ప్రోత్సాహం, నగర సుందరీకరణకు కృషి చేస్తున్న శ్రీ పొంగూరు నారాయణ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా ఉండటం మనకు ప్రత్యేక అవకాశం.
రాజధాని నిర్మాణంలోనూ కీలక అడుగులు వేస్తూ, నెల్లూరు నగర అభివృద్ధి–సుందరీకరణలో ఆయన పాత్ర మరువలేనది.
నెల్లూరు సిటీ 36 డివిజన్ల గెలుపుకై ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుదాం.
అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సహకారం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రదాని మోడీ జీ అందిస్తున్న సహకారం కూడా రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని తెలిపారు.
ప్రచారంలో భాగంగా ప్రజలు పలు ప్రాంతాల్లో జనసేన నాయకులను ఆప్యాయంగా పలకరించి తమ సమస్యలను వివరించారు. స్థానికంగా అవసరమైన అభివృద్ధి పనులపై కూడా నాయకులు ప్రజలతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల, లక్ష్మీకుమారి,ప్రవల్లిక, విజయ, సుప్రియ, కృష్ణవేణి, శ్రీ లక్ష్మి, కల్పన,విశ్వ, కృష్ణమోహన్ రెడ్డి, శివకృష్ణ, రాఘవ, ప్రశాంత్ గౌడ్, నరహరి, తదితరులు పాల్గొన్నారు.




