Nellore: నెల్లూరులో జనసేన రెండో రోజు ఇంటింటా ప్రచారం!
Nellore: నెల్లూరు రాంజీ నగర్‌లో జనసేన ఆధ్వర్యంలో రెండో రోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
Nellore: నెల్లూరులో జనసేన రెండో రోజు ఇంటింటా ప్రచారం!
Nellore: అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు"
16వ డివిజన్ రాంజీ నగర్‌లో జనసేన రెండో రోజు ఇంటింటా ప్రచారం – ప్రజల నుంచి విశేష స్పందన
"ప్రజాసేవకు బాటలు చూపిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రజల పట్ల భాద్యత, అభివృద్ధి అంటే ఏమిటో కార్యరూపంలో చూపిస్తున్న డా. పొంగూరు నారాయణ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్తుంటే, ప్రజలు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే ఇన్నాళ్లుగా చేసిన సేవకు ప్రతిఫలం అనిపిస్తోంది. ఈ నమ్మకమే మరింత బాధ్యతతో ప్రజల కోసం పనిచేసే శక్తిని ఇస్తోంది అని అన్నారు జనసేన నాయకులు కిషోర్ గునుకుల . "అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు" కార్యక్రమంలో భాగంగా రాంజీ నగర్‌లో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో రెండో రోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
"ప్రజల స్పందన – ప్రచారానికి ప్రధాన ఆకర్షణ"
"డీఎస్సీ కోసం ఐదేళ్లు ఎదురుచూశాం... ఇప్పుడు ఉద్యోగాల దారి తెరుచుకుంది. మా ఓటు కూటమికే." – ఓ మహిళ
"విధ్వంసం ముగిసింది,ప్రజా సేవే నడుస్తున్నది కూటమి ప్రభుత్వం. రానున్న ఎన్నికల్లో కూడా కూటమినే గెలిపిస్తాం." – స్థానిక మహిళ
"పవన్ కళ్యాణ్ నిజాయితీ, సేవా తత్వం మాకు ఎంతో నచ్చింది. జనసేనకు మా పూర్తి మద్దతు." – మహిళల బృందం
" ప్రజా సమస్యల కోసం జిల్లా లో మీరు చేసిన పోరాటాలు చూశాను. ప్రజల కోసం పనిచేసే నాయకుడికి మా కుటుంబం అండగా ఉంటుంది." – గృహిణి
వీఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌తో ఆప్యాయ భేటీ
ప్రచార కార్యక్రమంలో భాగంగా వీఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, వీఆర్‌సీ లెక్చరర్ రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నీ పేరు విన్నాను... నువ్వు నా స్టూడెంట్ అని ఇప్పుడే తెలిసింది. ప్రజల కోసం పనిచేయాలి. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు ఉంటాయి" అని అభినందించారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ...
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని, నెల్లూరు నగర ఎమ్మెల్యే, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నాయకత్వంలో రాంజీ నగర్‌లో రోడ్లు, తాగునీరు, మున్సిపల్ సేవలు వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. అభివృద్ధి కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల,ప్రవల్లిక,హేమచంద్ర యాదవ్, ప్రశాంత్ గౌడ్, నాగేంద్ర బాలు, నరహరి, ప్రతాప్, పైనాపురం కిషోర్, జనసేన మహిళా నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




