Nellore: జనసేన ఆధ్వర్యంలో చిరంజీవి బర్త్‌డే వేడుకలు!

Nellore: నెల్లూరు మాగుంట లేఅవుట్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

A Praveen, Nellore
Published on: 22 Aug 2026 6:00 PM IST
Nellore
X

Nellore: జనసేన ఆధ్వర్యంలో చిరంజీవి బర్త్‌డే వేడుకలు!

నెల్లూరు: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కళ్యాణ్‌ సోదరుడు, మెగాస్టార్‌ కొణిదెల చిరంజీవి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని జనసేన సీనియర్‌ నాయకుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు అన్నారు. శనివారం నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్‌లోని జనసేన జిల్లా కార్యాలయంలో చిరంజీవి జన్మదిన వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా సుజయ్‌బాబు మాట్లాడుతూ.. చిరంజీవి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న మహానటుడని అన్నారు. కోట్లాది మంది అభిమానుల ప్రేమను పొందిన ఆయన కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తన వంతు సహకారం అందించారని తెలిపారు. రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలకు చిరంజీవి అందించిన ప్రోత్సాహం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు.

కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే సేవాభావాన్ని ఆయన అభిమానుల్లో పెంపొందించారని పేర్కొన్నారు. మెగాస్టార్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నప్పటికీ.. సేవా కార్యక్రమాల్లో ఆయన చూపించే మానవత్వం మరింత గొప్పదన్నారు. చిరంజీవి వ్యక్తిత్వంలోని వినయం, మంచితనం, సేవాభావం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అభిమానులు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. చిరంజీవి పుట్టినరోజును కేవలం వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాల దినోత్సవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఎండలో రోడ్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు గొడుగులు అందించడం కూడా చిరంజీవి సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. చిరంజీవి పేరు మీద6 నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమం సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని ఆకాంక్షించారు. అభిమానాన్ని మాటల్లో కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా చాటుకోవడమే చిరంజీవికి ఇచ్చే నిజమైన గౌరవమన్నారు. చిరంజీవి నటన ఎన్నో తరాలకు ఆనందాన్ని పంచిందని, ఆయన సేవా దృక్పథం మరెన్నో తరాలకు స్ఫూర్తిని అందిస్తోందని సుజయ్‌బాబు పేర్కొన్నారు. చిరంజీవి ఆయురారోగ్యాలతో, సంతోషంగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయుష్షును ప్రసాదించాలని ప్రార్థిస్తూ.. మెగాస్టార్‌ చిరంజీవికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ రాష్ట్ర వీరమహిళలు గుండ్లూరు నాగరత్నం, షేక్ ఆలియా మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కో-కన్వీనర్ ప్రభు సాయి జిల్లా జనసేన నాయకులు శనివారపు అజయ్ బాబు , చిత్తూరు రాము , షేక్ ఆశిక్ , ఆముదాల సుమంత్ , చిన్ని రవి , శ్రీనివాసులు నాయుడు , వెంకటరమణ , నరసింహ గంగిశెట్టి , తెల్లం బాలు , హరీష్ , జితేంద్ర , శివకుమార్ , వీరమహిళలు హసీనా , మల్లికా , వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story