Nellore: సంతపేటలో జనసేన వినతికి స్పందించిన మంత్రి.. పనులు ప్రారంభం

Nellore: నెల్లూరు సిటీ 50వ డివిజన్ సంతపేటలో మంత్రి నారాయణ ఆదేశాలతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి.

V. Narasimhulu, Nellore
Published on: 27 April 2026 6:40 PM IST
Nellore
X

Nellore: సంతపేటలో జనసేన వినతికి స్పందించిన మంత్రి.. పనులు ప్రారంభం

Nellore: “సమస్య ఎక్కడుంటే అక్కడ జనసేన ప్రజల పక్షాన నిలబడుతుందని, 54 డివిజన్‌లోని కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ సమస్య వచ్చినా, కూటమి ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం వరకు జనసేన అండగా నిలుస్తుందని తెలిపారు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గురుకుల.

ప్రజల సేవే మా ధ్యేయం అదే పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో కూటమి ప్రభుత్వం ఆటంకం లేకుండా అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తుంటే, వైసిపి నాయకులు అనవసర విమర్శలు చేస్తూ తమ పాలనలో చేసిన అభివృద్ధి పనులు లేకపోవడంతోనే విమర్శలకే పరిమితమవుతున్నారని అన్నారు. ఇది వారి రాజకీయ దివాళాను స్పష్టం చేస్తోందని చెప్పారు. మంత్రి నారాయణ మాట్లాడే మనిషి కాదు-చేతల మనిషి అని అన్నారు కిషోర్ గునుకుల.

నెల్లూరు సిటీ సంతపేట 50వ డివిజన్ పరిధిలోని మెట్లరేవు ప్రాంతం, సాయిబాబా మందిరం సందు, మంత్రికి జనసేన ఇచ్చిన వినతి మేరకు చేపట్టిన రోడ్లు, కాలువలు, ప్రతి ఇంటికి నీటి పైప్ కనెక్షన్ల పనులను పరిశీలించేందుకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..

నెల్లూరు సిటీ అభివృద్ధి విషయంలో మాటలకే పరిమితం కాకుండా చేతలతోనే తన నిబద్ధతను నిరూపిస్తున్న నాయకుడు మంత్రి నారాయణ, మరోసారి ప్రజల మనసులు గెలుచుకున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాత్రమే కాదు, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చుతూ అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.

నెల్లూరు సిటీ పరిధిలోని సంతపేట, మెట్లరేవు ప్రాంతంలో గత ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు,కాలవలు,మంచి నీరు,సమస్యల పై గత పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శించిన సంగతి తెలిసిందేనని, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారి ఆధ్వర్యంలో సమస్యను మంత్రి నారాయణకి వివరించడం జరిగిందని చెప్పారు.

ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న మంత్రి నారాయణ తక్షణమే స్పందించి, ఆలస్యం చేయకుండా ఆ ప్రాంతంలో రోడ్డు, కాలవలు, నీరు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం అభినందనీయం అని అన్నారు. వివాదాలు, విమర్శలు ఉన్నప్పటికీ ప్రజల కోసం తన పనిని నిబద్ధతతో కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న నాయకుడిగా మరోసారి నిలిచారని తెలిపారు. ఈ అభివృద్ధి పనుల పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

రానున్న రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల సమన్వయంతో నెల్లూరు నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి కృషి కొనసాగుతుందని జనసేన నాయకులు, కూటమి కార్యకర్తలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రదాన కార్యదర్శి కిషోర్ గునుకుల,వారి సతీమణి నెల్లూరు ఎఎంసీ డైరెక్టర్ జనసేన వీరమహిళ గునుకుల విజయలక్ష్మి,“జనసేన పార్టీ పాక్షిక 49 & 50 డివిజన్ల క్లస్టర్ ఇన్‌చార్జ్ హరి, బ్లూ బోర్డ్స్ సంస్థ అధినేత వేములపాటి శివకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, కార్ 24 ట్రావెల్స్ అధినేత కర్రెద్దుల అశోక్, వీల్స్ ఆన్ ఐ ప్రతినిధి చిత్తూరు బాలాజీ, పద్మ, సాయి లక్ష్మి, మంజుల, భవాని, ఆమని తదితర జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story