Nellore: ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి.. చట్టబద్ధత చారిత్రాత్మకం జనసేన నేత కిషోర్ గునుకుల

Nellore: అమరావతి రాజధానికి పార్లమెంట్ ఆమోదంతో చట్టబద్ధత లభించడం ఆంధ్రుల ఆత్మగౌరవ విజయమని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 11:29 AM IST
Nellore
X

Nellore: ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి.. చట్టబద్ధత చారిత్రాత్మకం జనసేన నేత కిషోర్ గునుకుల

Nellore: ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి రాజధాని చట్టబద్రత చారిత్రాత్మక వేడుక అన్నారు జనసేన నాయకులు కిషోర్ గునుకుల.

అమరావతి కోసం ఎన్ని ఆటంకాలు వచ్చినా – అమరావతి ఒక్కటే మన రాజధాని అంటూ రాజకీయ లాభనష్టాలు చూసుకోకుండా ధైర్యంగా నిలబడి రాష్ట్రవ్యాప్తంగా గొంతెత్తిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని.. ఎవరు భయపడ్డా.. ఎవరు మౌనం వహించినా పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్రుల భవిష్యత్తు కోసం పోరాడారని చెప్పారు..

రాజధాని నిర్మాణంలో రైతులను ఒప్పించడం, దూరదృష్టి తో చారిత్రాత్మకంగా అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్న మన మున్సిపల్ శాఖ మాత్యులు మంత్రి నారాయణ అభినందనీయులని చెప్పారు.

జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల మాట్లాడుతూ..

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అమరావతికి రాజ్యసభ ఆమోదంతో చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టం అని అన్నారు..ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయ సూచనలతో భాషా ప్రాతిపదికన రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మొండి పట్టుదల స్ఫూర్తితో వారి విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించండి అని సూచించిన జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ పర్యవేక్షణలో జనసేన పార్టీ నాయకులు నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద దీపాలు వెలిగించి బాణసంచా కాల్చి, ఘనంగా వేడుకలు నిర్వహించారు.

గతంలో కూడా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమయంలో అనేక ప్రతిపాదనలు వచ్చినా, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినది తెలుగువారే.అదే స్పూర్తితో, ఈరోజు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పారు..

రైతులు తమ భూములను ఇచ్చింది ఏ పార్టీ కోసం కాదు భవిష్యత్ తరాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్న సత్యాన్ని పవన్ కళ్యాణ్ పలుమార్లు తెలిపారని చెప్పారు..

అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా లోకసభ, రాజ్యసభలో ఆమోదం రావడం ఆయన దూరదృష్టి కు నిదర్శనమని పేర్కొన్నారు..

ఈ చారిత్రాత్మక ఘట్టం లో ఆదర్శంగా నిలిచిన గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మున్సిపల్ శాఖ మాత్యులు పొంగూరు నారాయణ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు..

“మావిగన్… మావిగన్” అంటూ మరో జగన్నాటకం ప్రారంభించి మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు మాంత్రికుడు జగన్ కొత్త డ్రామా స్టార్ట్ చేశారని ఎద్దేవా చేశారు కిషోర్ గునుకుల.

“మూడు రాజధానులు” అంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పేర్లు లాగుతూ మరో Plan-B రాజకీయ నాటకం అని చెప్పారు..

“రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు రాజ్యాంగంలో లేదు” అంటూ మాట్లాడిన వారు.. మళ్లీ రాజధానులేంటని చెబుతున్నారు? అయితే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం ఎందుకు రాజధాని ఏర్పాటు చేసుకుంది? దానికి సమాధానం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు..

ఒకపక్క రాజుధానికి చట్టబద్రత విషయమై మంత్రులతో, ఎమ్మెల్యేల తో అసెంబ్లీలో కూర్చుని చర్చించాల్సింది పోయి, అదే సమయంలో.. మరో పక్క ప్రెస్ మీట్ నిర్వహించి, జాతి హీనులుగా నిలిచారు జగన్..

అమరావతి పై కుట్రలు చేసిన వారిని చరిత్ర క్షమించదు అని చెప్పారు..

అమరావతి రాజధానికి మొదటి నుంచి వ్యతిరేకంగా నిలిచి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించిన జగన్‌మోహన్ రెడ్డి వైఖరి అందరికీ తెలిసిందే.

ప్రజలంతా సంతోషంగా, గర్వంగా భావించే రాజధాని అమరావతిని అడ్డుకోవడమే లక్ష్యంగా “మూడు రాజధానులు” అనే ప్లాన్-బి తీసుకువచ్చి రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారని చెప్పారు..

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, చితమూరి ప్రవీణ్ రెడ్డి పప్పు నారాయణ, జమీర్, శివకృష్ణ నక్కల, సాయి, హేమచంద్ర, నాగేంద్రబాబు, శరవన్న, సుధా మాధవ్, పేనేటి శ్రీకాంత్, గుత్తి శ్రీకాంత్, వర్షన్, ప్రతాప్, సురేష్, కరీం, ప్రసన్న, ఉదయ్, వీర మహిళలు, కృష్ణవేణి, మోపురు నందిని, లతా, ప్రవళిక, రుక్మిణి, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story