Nellore: నెల్లూరు సిటీలో జనసేన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రచారం!
Nellore: నెల్లూరు సిటీ కొత్త 21వ డివిజన్‌లో జనసేన నాయకుల ఆధ్వర్యంలో కొనసాగిన కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం.
Nellore: నెల్లూరు సిటీలో జనసేన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రచారం!
Nellore: కొత్త 21వ డివిజన్‌లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కొనసాగుతున్న ప్రచారం ఈరోజు కూడా యథావిధిగా కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక కుటుంబాలతో మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
ప్రచారంలో స్థానికులు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పారదర్శక పాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి గురించి చర్చించారు. అలాగే ‘పల్లె పండుగ 3.0’ ద్వారా భారీ స్థాయిలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడాన్ని కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యతకు నిదర్శనంగా పేర్కొన్నారు.
నెల్లూరు సిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే దిశగా, నగరాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలతో పాటు అమరావతి నిర్మాణంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ గారి కార్యక్రమాలపై కూడా ప్రచారంలో వివరించారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, దీర్ఘకాలిక అభివృద్ధి ఆలోచన,దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని,కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రానికి అందుతున్న సహకారం గురించి కూడా స్థానికులతో చర్చించారు.
కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమం, సమపాలనకు మద్దతుగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరఫున ఎవరు అభ్యర్థులుగా నిలిచినా వారికి తమ మద్దతు ఉంటుందని, అభివృద్ధి కొనసాగేందుకు తామంతా కూటమి అభ్యర్థులను గెలిపిస్తామని తెలీపారు.
ఈ ప్రచార కార్యక్రమంలో గునుకుల విజయలక్ష్మితో పాటు కుమారి, విజయ, ప్రవల్లిక, ప్రశాంతి, సుప్రియ, బాలాజీ, ఆమని తదితరులు పాల్గొన్నారు.




