Nellore: గోవింద నామాన్ని అపహాస్యం చేయడంపై జనసేన ఫిర్యాదు
Nellore: గోవింద నామాన్ని రాజకీయాలకు వాడి అపహాస్యం చేసిన వైసీపీ నాయకులపై నెల్లూరు వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు.
Nellore: గోవింద నామాన్ని అపహాస్యం చేయడంపై జనసేన ఫిర్యాదు
నెల్లూరు: హిందూ ధర్మాన్ని, హిందువుల విశ్వాసాలను, మన పవిత్రమైన సంప్రదాయాలను రాజకీయ ప్రయోజనాల కోసం అపహాస్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ.... జనసేన పార్టీ JanaSena Party నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఈరోజు నాయకులు ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ....
గోవింద నామాన్ని రాజకీయ నినాదంగా మార్చి అపహాస్యం చేయడం కోట్లాది మంది హిందువుల భక్తి, విశ్వాసాలను అవమానించడమేనని అన్నారు... గోవింద నామం రాజకీయ నినాదం కాదు... అది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. పవిత్రమైన గోవింద నామాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించి అపహాస్యం చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది” అని స్పష్టం చేశారు.
"ధర్మం, సంప్రదాయాల పరిరక్షణే జనసేన వైఖరి"
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజల విశ్వాసాలను, మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలనే స్పష్టమైన వైఖరితో ముందుకు సాగుతున్నారని నాయకులు పేర్కొన్నారు. రాజకీయాలు వేరైనా, ప్రజల భక్తి విశ్వాసాలు, దేవతలు, పవిత్ర సంప్రదాయాలను రాజకీయాలకు ఉపయోగించడం సరికాదని అన్నారు.
వైసీపీ నాయకులు గోవింద నామాన్ని అవహేళన చేసే విధంగా వ్యవహరించడాన్ని జనసేన నాయకులు తీవ్రంగా ఖండిస్తూ, ఈ ఘటనపై నెల్లూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేశారు. మత విశ్వాసాలను అవమానించే విధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగబద్ధంగా గట్టిగా ప్రశ్నిస్తామని, తమ పోరాటం వ్యక్తిగత కక్షతో కాదని... మన ధర్మం, మన సంప్రదాయం, మన భక్తి, మన ఆత్మగౌరవం కోసం అని జనసేన నాయకులు స్పష్టం చేశారు. ఎవరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సరే, కోట్లాది మంది ప్రజల మత విశ్వాసాలను, దేవతలను, పవిత్రమైన ఆచార సంప్రదాయాలను అవమానించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్, పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కారంపూడి కృష్ణారెడ్డి, ఏటూరి రవికుమార్, జూటూరు మహేష్ శర్మ,చంటిబాబు, పవన్ యాదవ్, కాకు మురళి రెడ్డి,బెల్లపు సుధా మాధవ్,పేనేటి శ్రీకాంత్ దివాణం సురేష్ బాబు,దాడి భాను కిరణ్ నాగేంద్రబాలు,కృష్ణమోహన్ రెడ్డి, హరిబాబు ఆఫీస్ ఇంచార్జి జమీర్ తో పాటు
వీర మహిళలు: నందిని శాంతి కళ, నాగవేణి జనసైనికులు, కార్యకర్తలు పాల్గొని ధర్మ పరిరక్షణకు తమ సంఘీభావాన్ని తెలిపారు.




