Nellore: పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నెల్లూరులో జనసేన సేవా కార్యక్రమాలు
Nellore: నెల్లూరు సిటీ ట్రంక్ రోడ్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు.
Nellore: పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నెల్లూరులో జనసేన సేవా కార్యక్రమాలు
Nellore: జనసేన పార్టీ మూలాలు, భావజాలం ఎంత బలంగా ఉన్నాయో తెలుపుతూ అప్పటి నాయకులపై అదే అబిమానాన్ని కొనసాగిస్తూ.. మన ఆడపడుచు తుపాకుల మునెమ్మ తో చలివేంద్రం ప్రారంభించామని చెప్పారు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల.
ప్రజారాజ్యం పార్టీ కాలం నుంచే దళిత మహిళలకు తొలి టికెట్ కేటాయిస్తూ సామాజిక సమానత్వానికి నాంది పలికిన అదే భావజాలాన్ని కొనసాగిస్తూ, జనసేన పార్టీతో అనేక మంది సామాన్యులకు రాజకీయ అవకాశాలు కల్పించిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు.
మొన్నీమధ్య ఒక వర్గానికి చెందిన నాయకుడు దీక్ష చేపట్టిన సమయంలో, అదే వేదికపై మరో వర్గ నాయకుడు నోటికి వచ్చినట్లుగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భం వారి కనువిప్పుకై ఉండాలని భావిస్తూ, ఈరోజు తుపాకుల మునెమ్మను తో చలివేంద్రం ప్రారంభించామని చెప్పారు.
నెల్లూరు సిటీ ట్రంక్ రోడ్‌లోని గాంధీ విగ్రహ కూడలి వద్ద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కిషోర్ గునుకుల ఆధ్వర్యంలో “డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం”ను శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించి ప్రజలకు చల్లని మజ్జిగ అందిస్తూ సేవాభావాన్ని చాటారు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో గత సంవత్సరం దాదాపు పది సెంటర్లలో వేలాది లీటర్ల మజ్జిగను పంపిణీ చేసినట్లే, ఈ సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ –
జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ సూచనల మేరకు నగరంలోని ముఖ్య కూడళ్లలో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని కూడా తెలియజేస్తున్నామని చెప్పారు.
“రాజకీయాల్లోకి రావడం అధికారాల కోసం కాదు, ప్రజలకు సేవ చేయడానికే” అనే జనసేన పార్టీ సిద్ధాంతాన్ని మరోసారి గుర్తుచేశారు. ప్రజల కోసం, ప్రజలతో కలిసి సేవా కార్యక్రమాలు కొనసాగించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెగా అభిమాని మా ఆడపడుచు తుపాకుల మునెమ్మ ,జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, బ్లూ బోర్డ్స్ సంస్థ అధినేత వేముల శివకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, జనసేన నాయకులు కార్ 24 ట్రావెల్స్ అధినేత కర్రెద్దుల అశోక్, నెల్లూరు ఎఎంసీ డైరెక్టర్ మరియు జనసేన వీరమహిళ గునుకుల విజయలక్ష్మి,జనసేన సీనియర్ నాయకులు చిట్టమూరు ప్రవీణ్ రెడ్డి, రుషి, హేమచంద్ర యాదవ్,
నాగేంద్ర బాలూ, రాఘవ, మనోజ్, శ్రీకాంత్, వర్షచలం రాజేష్, శరవణ, తేజ, హరి, వర్షన్, కృష్ణమోహన్ రెడ్డి, ప్రతాప్, వీర మహిళలు సుభాషిని, నందిని, సాయి లక్ష్మి, వాణి, లత, పద్మ, భవాని, అమని తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జనసేన నాయకులు, వీరమహిళలు, మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




