Nellore: పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు రాజకీయ కుట్ర.. జనసేన

Nellore: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సుగాలి ప్రీతి (కీర్తి) తల్లి పార్వతమ్మ చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని జనసేన వీర మహిళ షేక్ ఆలియా మండిపడ్డారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 8 July 2026 8:27 AM IST
Nellore
X

Nellore: పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు రాజకీయ కుట్ర.. జనసేన

Nellore: జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌పై సుగాలి కీర్తి తల్లి పార్వతమ్మ చేసిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని జనసేన వీర మహిళ ఆలియా ఆరోపించారు. మంగళవారం నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌లో గల జనసేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు- చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.. సుగాలి కీర్తి పదో తరగతి చదువుతున్న సమయంలో జరిగిన దారుణ ఘటనపై అప్పట్లో కేసు నమోదైన తర్వాత బాధిత కుటు-ంబానికి న్యాయం చేయాలనే సంకల్పంతో పవన్‌ కళ్యాణ్‌ స్పందించారని ఆమె తెలిపారు.

పార్వతమ్మను తన కార్యాలయానికి పిలిపించి ధైర్యం చెప్పడమే కాకుండా, కేసు చివరి వరకు న్యాయం జరిగేలా పోరాడతానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బాధితురాలి కుటు-ంబానికి అండగా నిలిచిన నాయకుల్లో పవన్‌ కళ్యాణ్‌ ముందువరుసలో ఉన్నారని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలోనే ఈ కేసును సీబీఐకి అప్పగించారని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని తెలిపారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్‌ కళ్యాణ్‌ ఈ అంశాన్ని మరచిపోలేదని, వివిధ సందర్భాల్లో బాధిత కుటు-ంబానికి న్యాయం జరగాలని కోరుతూ మాట్లాడారని చెప్పారు.

పవన్‌ కళ్యాణ్‌పై తాజాగా చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు ఈ అంశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆలియా విమర్శించారు. బాధిత కుటు-ంబం పేరును రాజకీయాలకు ఉపయోగించడం తగదని, న్యాయ ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించకూడదని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పారదర్శక పాలన, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని ఆలియా అన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి దుష్ప్రచారాలను నమ్మవద్దని కోరారు.ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలిచే నాయకుడని, అన్యాయం జరిగిన ప్రతి సందర్భంలో తన గళాన్ని వినిపించారని ఆలియా పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే ఆయన లక్ష్యమని, రాష్ట్ర అభివృద్ధి, సుపరిపాలన కోసం కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని చెప్పారు.. చివరిగా, న్యాయ ప్రక్రియపై విశ్వాసం ఉంచాలని, సుగాలి కీర్తి కేసులో నిజాలు వెలుగులోకి వచ్చి బాధిత కుటు-ంబానికి న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో వీర మహిళలు హైమావతి, హసీనా, వరలక్ష్మీ, రేణుక, మల్లిక, సింధు, తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story