Nellore: పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి: జేసీ వెంకటేశ్వర్లు!

Nellore: సెప్టెంబర్ 25న జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా 1-19 ఏళ్ల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని నెల్లూరు జేసీ వెంకటేశ్వర్లు ఆదేశించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 15 Sept 2026 10:08 PM IST
Nellore
X

Nellore: పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి: జేసీ వెంకటేశ్వర్లు!

నెల్లూరు: నెల్లూరు కలెక్టర్ కార్యాలయం శంకరన్ భవన్ నందు “ జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సెప్టెంబర్ 25 “ కావున డిస్ట్రిక్ట్ కన్వర్జెన్స్ మీటింగ్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తో జాయింట్ కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 25, 2026 తేదీన జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఆల్బెండజోల్ మాత్రలు అన్ని అంగన్వాడీసెంటర్స్, పాఠశాలలు, కళాశాలల్లో ఉచితంగా ఇవ్వబడతాయని, కావున 1 to 19 సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలు అందరూ ఈ మాత్రలు మ్రింగవలెనని తెలియ జేశారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత గారు మాట్లాడుతూ నులిపురుగుల సోకిన పిల్లలు రక్త హీనత , ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి వాంతులు, నీరసం , బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అల్బెండజోల్ మాత్రలను తీసుకోవాలని సూచించారు ప్రతి అధికారి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో DLATO డాక్టర్ ఖాదర్ బాషా Dio డాక్టర్ బ్రిజిత NCD/RBSK నోడల్ ఆఫీసర్ డాక్టర్ అన్షుదర్, DPMO డాక్టర్ సునీల్, ఐసీడీఎస్ PD శైలజ, డిప్యూటీ డెమో సునీత, ఇతర ప్రోగ్రామ్ అధికారులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE