Atmakur: జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో ఆత్మకూరు విద్యార్థికి 26వ ర్యాంక్
Atmakur: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన విద్యార్థి భవిష్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా 26వ ర్యాంకు సాధించి రికార్డు సృష్టించాడు.
Atmakur: జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో ఆత్మకూరు విద్యార్థికి 26వ ర్యాంక్
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పంట వీధికి చెందిన చెందిన పందిపాటి. భవిష్ కుమార్ రెడ్డి అనే విద్యార్థి ఆల్ ఇండియా జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో 26వ ర్యాంకు సాధించాడు. ఆత్మకూరు పట్టణం పంట వీధికి చెందిన పందిపాటి వెంకటేశ్వరరెడ్డి, శ్రీమతి సౌజన్య కుమారుడైన ఈ విద్యార్థి మొన్న జరిగిన జేఈఈ అడ్వాన్స్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా 26వ ర్యాంకు సాధించడం జిల్లాకే గర్వకారణం. వ్యవసాయ కుటుంబానికి చెందిన భవిష్ కుమార్ రెడ్డి కష్టపడి చదువులో రాణిస్తూ నేడు ఈ ర్యాంకు సాధించడం పై వారి తల్లిదండ్రులు బంధువులు ఆత్మకూరు గ్రామస్తులు అభినందనలు తెలుపుతూ ఎంతో సంతోషం వ్యక్తపరిచారు.. సుమారు రెండు లక్షల మంది రాసిన ఈ పరీక్షలో ఈ విద్యార్థి 26 ర్యాంకు సాధించడం నిజంగా అభినందనీయం.
Next Story




