Nellore: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కన్నీటి గాథలు

Nellore: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్‌పి 149 అర్జీలను స్వీకరించారు.

V. Narasimhulu, Nellore
Published on: 27 April 2026 8:16 PM IST
Nellore
X

Nellore: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కన్నీటి గాథలు

Nellore: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే విజ్ఞప్తులు పునరావృతం కాకుండా, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్‌పి ఆదేశించారు. ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్‌పి మరియు ఇతర అధికారుల సమక్షంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (Public Grievance Redressal System)” కార్యక్రమంలో మొత్తం 149 ఫిర్యాదులు స్వీకరించారు.

ముఖ్య సూచనలు:

ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని చెప్పారు. ప్రజలతో జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ప్రతి పిటిషన్‌ను సమగ్రంగా విచారించి పరిష్కరించాలని చెప్పారు.

ఈరోజు అందిన ఫిర్యాదులలో ముఖ్యమైనవి:

1. వేదాయపాలెం PSకు చెందిన మహిళా, కర్నూల్ కి చెందిన కొండా.ప్రదీప్ కుమార్, ఒంగోలు కు చెందిన వెంకట సురేంద్ర లు కలిసి నాకు హైదరాబాద్ IT కంపెనీ లో జాబ్ ఇప్పిస్తానని 1,25,000/ తీసుకొని ఇప్పించకపోగా 25.10.25 నుంచి ఇబ్బందులకి గురిచేస్తున్నట్టు,వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

2. మనుబోలు PSకు చెందిన మహిళా, తన భర్త అత్తఇంటి వారు అదనపు కట్నం కోసం తనను శారీరకంగా మానసికంగా వేదిస్తునట్టు,తనని ఇంటినుంచి గెంటివేసినట్టు విచారించి వారిపై తగిన చర్యలు తీసుకోవలని ఫిర్యాదు చేశారు.

3. నవాబుపేట PSకు చెందిన మహిళా, తన కుమార్తె వయస్సు 14 సంవత్షరాలు తేది:21.04.26.నుంచి కనిపించడం లేదని దాని విషయమై నవాబుపేట PS లో కేసు నమోదైనట్టు కేసుని విచారించి తన బిడ్డ ఆచూకీ కనుగోనమని డానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలని తీసుకొనమని పిర్యాది కోరారు..

4. కావలి 2టౌన్ PSకు చెందిన మహిళా, తన ఇంటిలో గత సెప్టెంబర్ నెలలో దొంగతనం జరిగినట్టు,బంగారం వెండి దొంగిలించినట్టు కావలి 2టౌన్ PS లో కేసు నమోదైనట్టు,కేసు ని విచారించి చోరి సొత్తుని రికవరీ చేయమని కోరారు.

5. అల్లూరు PSకు చెందిన మహిళా, తన భర్తతో విడాకులు పొంది ఉండగా అదేప్రాంతానికి చెందిన మోడెం.అనిల్ కుమార్,సుకుమార్ అనే ఇద్దరు చెడు ఉద్దేశ్యంతో వేదిస్తున్నట్టు,తమ మాట వినకపోతే తన వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో ఉంచుతామని విచరించి న్యాయం చేయమని పిర్యాది కోరారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ, వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో WPS DSP U. సత్యనారాయణ,DTC DSP శ్రీ గిరిధర్ ,కావలి DSP V.V.రమణ కుమార్, మహిళా స్టేషన్ CI సుబ్బారావు, కంట్రోల్ రూమ్ CI భక్తవత్సల్ రెడ్డి, SB-2 CI శ్రీనివాస రెడ్డి మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story