Nellore: నెల్లూరులో జోరుగా కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం!
Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన నేతల విస్తృత ప్రచారం. కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతు కోరుతూ ఇంటింటి తిరుగుళ్లు.
Nellore: నెల్లూరులో జోరుగా కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం!
Nellore: ప్రజల సంక్షేమం, నగర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి ఘన విజయం అందించాలని జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకుల కోరారు.
కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాత 16వ డివిజన్, కొత్త 20వ డివిజన్ పరిధిలోని చైతన్య శిఖర అపార్ట్‌మెంట్ వీది తదితర ప్రాంతాలలఙ క్యాంపెయిన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత పదేళ్లుగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలిచారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ప్రతి గడపలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల స్పందన, సంతోషం స్పష్టంగా కనిపించిందని నాయకులు తెలిపారు. అభివృద్ధి అడుగులు మరింత వేగంగా సాగాలని, సంక్షేమ వెలుగులు ప్రతి ఇంటా విరబూయాలని ఆకాంక్షించారు.
రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, నెల్లూరు నగర అభివృద్ధికి ప్రజలు మరింత బలమైన మద్దతు ఇవ్వాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల,వారి శ్రీమతి ఎఎంసి డైరెక్టర్ విజయలక్ష్మి గునుకుల, ప్రశాంత్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మల్లిరెడ్డి, ప్రవల్లిక, విజయ, సుప్రియా, సునీత,కృష్ణ మోహన్ రెడ్డి,మల్లి రెడ్డి, విశ్వనాథ్,రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




