Varigonda: జ్వాలాముఖి ఆలయంలో ఉచితంగా తాళిబొట్టు పెళ్లి దుస్తుల పంపిణీ!
Varigonda: శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకునే నూతన జంటలకు ఆలయ నిర్వాహకులు కోడూరు రాజేశ్వరి, చినబాబు రెడ్డి దంపతులు ఉచితంగా తాళిబొట్టు, వస్త్రాలు బహుకరిస్తున్నారు.
Varigonda: జ్వాలాముఖి ఆలయంలో ఉచితంగా తాళిబొట్టు పెళ్లి దుస్తుల పంపిణీ!
Varigonda: తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండ గ్రామంలో వెలసిన ఉన్న శ్రీ శ్రీ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయం భక్తి, దానధర్మాలకు నిలయంగా నిలుస్తోంది. పేద, సామాన్య కుటుంబాలకు అండగా నిలిచే ఉద్దేశంతో ఆలయ చైర్మన్ కోడూరు రాజేశ్వరి, ఆమె భర్త కోడూరు చినబాబు రెడ్డి దంపతులు ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
వరిగొండ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వివాహం చేసుకునే ప్రతి నూతన జంటకు తాళిబొట్టు వివాహ దుస్తులను బహుమతిగా అందజేస్తున్నారు. వివాహ సమయంలో పేద, సామాన్య కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని కొంతైనా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
అమ్మవారి దివ్య సన్నిధిలో వివాహ బంధంతో ఒక్కటయ్యే ప్రతి జంట సుఖసంతోషాలతో జీవించాలనే సత్సంకల్పంతో తాళిబొట్టు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తి కార్యక్రమాలతో పాటు పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సేవను కొనసాగిస్తున్నామని తెలిపారు.వరిగొండ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకునే పేద, సామాన్య కుటుంబాల వారు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
నూతన దంపతులపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈసేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కోడూరు రాజేశ్వరి, కోడూరు చిన్నబాబు రెడ్డి తెలిపారు. ఆలయ చైర్మన్ కోడూరు రాజేశ్వరి చిన్న బాబిరెడ్డి దంపతులు అమ్మవారి దేవాలయం నందు వివిధ రకాలైన పూజా కైకర్యాలు నిర్వహిస్తూ దేవస్థానం అభివృద్ధికి తమ వంతు కృషిగా గతంలో ఎన్నడూ లేని విధంగా దేవాలయం అభివృద్ధి చేసి తమ భక్తిని చాటుకున్నారు.




