Kavali: కావలిలో బాధిత గిరిజన మహిళకు వైఎస్సార్‌సీపీ అండ.. ప్రభుత్వంపై కాకాణి ఫైర్

Kavali: కావలి కచేరిమిట్టలో దాడికి గురైన ఎస్టీ మహిళను పరామర్శించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి కమిటీ. నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్.

V. Narasimhulu, Nellore
Published on: 2 July 2026 9:44 PM IST
Kavali
X

Kavali: కావలిలో బాధిత గిరిజన మహిళకు వైఎస్సార్‌సీపీ అండ.. ప్రభుత్వంపై కాకాణి ఫైర్

కావాలి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుల అఘాయిత్యానికి గురైన ఎరుకుల మహిళను మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , శాసన మండలి సభ్యులు కుంభా రవిబాబు, వైఎస్ఆర్ సీపీ ఎస్ టి సెల్ రాష్ట్ర అధ్యక్షులు గుండా సురేంద్ర, ఎస్టీ సెల్ మహిళా నేతలు, వైయస్సార్సీపి నాయకుల తో కలిసి పరామర్శించి, అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి కావలి కి విచ్చేసిన కాకాణికి ఘన స్వాగతం పలికారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

అనంతరం కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ....

కావలి నగరంలోని కచేరిమిట్ట ప్రాంతంలో ఎస్టీ (గిరిజన) మహిళపై జరిగిన దాడి నన్ను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు... గిరిజన మహిళకు జరిగిన అన్యాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని,ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించి, బాధితురాలికి అండగా నిలిచేందుకు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రత్యేకంగా ఒక కమిటీ ఇక్కడికి విచ్చేసిందని చెప్పారు..

గతంలో ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా, శాసనసభ్యునిగా పనిచేసి, ప్రస్తుతం శాసనమండలి సభ్యునిగా ఉన్న కుంభా రవిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడు సురేందర్ ,మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎస్టీ సెల్ మహిళా నేతలతో కలిసి పరామర్శించి,బాధిత మహిళకు ధైర్యం చెప్పామని తెలిపారు.

రాష్ట్రంలో మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, కూటమి నాయకులే మహిళలపై అఘాయిత్యాలు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూస్తూ ఉండిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళల వైపు చూడాలంటే భయపడేవారని, జగన్మోహన్ రెడ్డి దిశా యాప్ తెచ్చి, మహిళలకు రక్షణ కల్పించారని గుర్తు చేశారు.

చంద్రబాబు ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్లినా ఒకటే మాట చెబుతున్నారని, ఎవరైనా మహిళల జోలికి వచ్చినా, మహిళల మీద చేయి వేసినా.. ఆ రోజే వాళ్లకు ఆఖరి రోజు అవుతుంది" అంటూ నిన్న కూడా గూడూరులో డైలాగులు కొట్టాడని, ఒక ఎస్టీ మహిళకు తీవ్ర అన్యాయం జరిగిందని మే ము పదే పదే ప్రశ్నిస్తున్నా, ఈ కేసు జరిగి ఇన్ని రోజులవుతున్నా కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. కనీసం నిందితులను అరెస్ట్ చేయలేదని, దీని గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.

గిరిజన మహిళ కేసులో పోలీసులు, ఎంఆర్ఓలు ఏ విధంగా వ్యవహరించారో అందరం చూశామని, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయని, గిరిజన మహిళ కేసును ఏదో ఒక రకంగా నీరుగార్చాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని,నిందితులను కాపాడటానికి, బాధితులనే రివర్స్‌లో నిందితులుగా చిత్రీకరించడానికి దొంగ సర్టిఫికెట్లు సృష్టించారని అన్నారు. బాధితులను రకరకాలుగా బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి ఈ కేసు ముందుకు వెళ్లకుండా చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో ఉన్నారని,

జన్మతః ఏదైతే కులం తో పుడతామో, అదే కులం కొనసాగుతుందే తప్ప, మారమంటే మారదని చెప్పారు. సదరు వ్యక్తులు అసలు 'ఎస్టీ' (ST) వర్గానికి చెందినవారా కాదా అనే విషయంపై స్థానిక MRO పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, రాష్ట్రంలో పోలీసు, రెవెన్యూ వ్యవస్థల తీరు దారుణంగా తయారైందని, అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తూ, పోలీసులు అసలైన బాధితులను నిందితులుగా చిత్రీకరిస్తున్నారని, ఇది రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయిందని అన్నారు.

గిరిజన మహిళకు జరిగిన అన్యాయంపై తాము ఖచ్చితంగా ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, మరియు హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను ఆశ్రయిస్తామని అన్నారు. అధికారం శాశ్వతం కాదని,ఈ రోజు ఉన్న అధికారం రేపు మారిపోతుందని, ఇప్పుడు తప్పు చేసిన అధికారులు రేపు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

బాధితులను వేధిస్తున్న వారి కుటుంబాలు, భవిష్యత్తులో అంతకు పదిరెట్లు మానసిక వేదన అనుభవించాల్సి వస్తుందని, గిరిజన మహిళ వ్యవహారంలో జిల్లా ఎస్పీ ,కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకొని,ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, నిష్పక్షపాతంగా (సాఫీగా) విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత గిరిజన కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలపై పోరాడుతామని తెలిపారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story