Nellore: నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి వైసిపి డిమాండ్

Nellore: మున్సిపల్ కమిషనర్ టీడీపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారంటూ డీఆర్ఓకు వైసిపి నేతలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు.

V. Narasimhulu, Nellore
Published on: 27 Jun 2026 8:54 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి వైసిపి డిమాండ్

నెల్లూరు: తెలుగుదేశం కు అనుకూలంగా వ్యవహరిస్తున్న నెల్లూరు మునిసిపల్ కమిషనర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ..YCP జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి DRO కు మెమోరాండం అందజేశారు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

1) నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల మునిసిపల్ కమిషనర్ మరియు మంత్రి నారాయణ ..BLO లతో సమావేశం నిర్వహించడం, అలాగే..

2) తెలుగుదేశం పార్టీ BLA ల టెలికాన్ఫరెన్స్ లో కమిషనర్ పాల్గొని ఐ టిడిపి యాప్ వినియోగించుకొవాలని తెలుగుదేశం పార్టీ బి ఎల్ ఏ లకు సూచించడం..

3) తెలుగుదేశం బి ఎల్ ఏ లకు మాత్రమే కమిషనర్ టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్ ప్రాసెస్ లో involve అయి త్వరగా పూర్తి చేయాలని టిడిపి బి ఎల్ ఏ లకు దిశా నిర్దేశం చేయడం .

ఇవి రాజ్యాంగ విరుద్దమని మునిసిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ YCP జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైసిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి... DROని కలిసి మెమోరాండం అందజేశారు.

రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహారిస్తున్న.. మునిసిపల్ కమిషనర్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో SIR ప్రక్రియలో ..ERO మున్సిపల్ కమిషనర్.. తెలుగుదేశం పార్టీ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ......

తెలుగుదేశం పార్టీ.. ప్రజలు నమ్మకాన్ని కోల్పోయి.. రాజ్యాంగ వ్యవస్థలను.. స్వప్రయోజనాలకు వినియోగించుకోవాలని చూస్తుండడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే ఆపార్టీ పూర్తిగా ప్రజాధరణను కోల్పోయిందన్నారు.SIR ప్రక్రియను పూర్తిగా రాజకీయంగా.. వినియోగించుకుంటూ.. వారికి సంబంధించిన ఓట్లను మాత్రమే.. ఉంచుకొని మిగిలిన ఓట్లను తొలగించే ప్రక్రియను తెలుగుదేశం పార్టీ చేపడుతున్నారని తెలిపారు.

తెలుగుదేశం పార్టీని ప్రజలు ఛీ కొడుతున్న... ఎలా అయినా మళ్లీ అధికారంలోకి రావాలని కుయుక్తులు పన్నుతూ ఎస్ఐఆర్ ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నారని అన్నారు.. నెల్లూరులో మున్సిపల్ కమిషనర్ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ లా మారిపోయి ఆ పార్టీకి సంబంధించిన బిఎల్ఎ లకు.. సూచనలు సలహాలిస్తూ.. SIR ప్రక్రియను పూర్తిగా బ్రస్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు.

ఇటీవల కమిషనర్ బిఎల్ఓ లను సమావేశపరిచి ఆ సమావేశానికి మంత్రిని ఆహ్వానించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అన్నారు. అలాగే నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ బి ఎల్ ఏ ల టెలికాన్ఫరెన్స్లో.. కమిషనర్ జాయిన్ అయ్యి.. తెలుగుదేశం పార్టీ బిఏల్ఏలకు ఐ టీడీపీ యాప్ ను ఉపయోగించుకొని.. ఎస్ ఐ ఆర్ ప్రక్రియను చేపట్టాలని సూచించడం.. సిగ్గుచేటు అన్నారు.. కమిషనర్ రాజ్యాంగ విలువలు మరిచి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి.. ఏజెంట్ గా వ్యవహరించడం.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.

దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేసి కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ కమిషనర్ కు షోకాస్ నోటీస్ జారీ చేసి.. మిన్న కుండిపోయారని ఇది సరైన పద్ధతి కాదన్నారు.. రాజ్యాంగానికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్న కమిషనర్ ను పూర్తిగా ఎన్నికల విధుల నుంచి బర్తరఫ్ చేయాలని.. చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story