Nellore: జగన్‌కు వినాయకుని ఆశీస్సులు ఉండాలి: కాకాణి గోవర్ధన్ రెడ్డి!
Nellore: వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వైఎస్ జగన్ దంపతుల పేరిట మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Nellore: జగన్‌కు వినాయకుని ఆశీస్సులు ఉండాలి: కాకాణి గోవర్ధన్ రెడ్డి!
నెల్లూరు: ఈ సందర్భంగా మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో , వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దంపతుల పేరిట ప్రత్యేక పూజలు చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా అందుబాటులో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు
జగన్ గారికి విఘ్నాలు తొలగాలి...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోయి, ఆ విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలతో చేపట్టే ప్రతి కార్యక్రమంలో, వేసే ప్రతి అడుగులో విజయం సిద్ధించాలని సిద్ధి వినాయకుడిని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు.
జగన్ గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు సుఖసంతోషాలు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము.
విఘ్ననాథుని ఆశీస్సులతో
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ప్రజలందరూ సుఖసంతోషంగా ఉండగలరనే నమ్మకం, విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. జగన్ గారి పాలన ద్వారా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేలా వినాయకుడు తన ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్లు కాకాణి పేర్కొన్నారు.
వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కాకాణి గోవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో రాబోయే రోజులన్నీ వైఎస్సార్సీపీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు దివ్యంగా ఉండాలని, అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు.
ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న రైతులు, సాధారణ ప్రజల సమస్యలన్నీ తొలిగిపోవాలని విఘ్ననాథుడిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలకు ప్రత్యేకంగా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు.
కూటమి పాలనలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు అన్ని రకాలుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాకాణి విమర్శించారు. వర్షాభావం కారణంగా రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. ప్రజలు త్రాగునీరు, సాగునీరు లేక, మరోవైపు నిరంతర కరెంట్ కోతలతో అల్లాడిపోతుంటే కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పత్రికల్లో సమీక్షలు నిర్వహించినట్లు చూపిస్తూ, ప్రభుత్వం నాటకాలాడుతోందని ఎద్దేవా చేశారు.
జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వమే శ్రీరామరక్ష...
ప్రజలకు ఎదురవుతున్న ఈ విఘ్నాలన్నీ తొలగిపోవాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్లీ మంచి ప్రభుత్వం వీలైనంత త్వరగా కొలువు తీరాలని కాకాణి ఆకాంక్షించారు. జగన్ గారి పాలనలోనే ప్రజల బాధలు తొలగిపోతాయని ఆయన పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను పైన ఉన్న భగవంతుడు కూడా గమనిస్తున్నాడని అన్నారు. విఘ్నాలను తొలగించే వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలని, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని స్వామివారిని వేడుకున్నట్లు కాకాణి వెల్లడించారు...
తిరుమల శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వం తీరు...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఎన్నో అరాచకాలకు గురైందని, చివరికి తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి విమర్శలు చేయడం దారుణమని కాకాణి మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు చేసిన ఆరోపణలు అబద్ధాలని తేలిపోయాయని, తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టుగా స్వయంగా దేవుడే తన మహిమతో నిరూపించారని కాకాణి వ్యాఖ్యానించారు.
సిబిఐ విచారణలో నిగ్గు తేలింది...
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు వేసిన అబండాలు, అబద్ధాలు సరికావని విచారణ సంస్థ సిబిఐ స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
దేవుడి పట్ల భయం, భక్తి లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, టీటీడీ లడ్డూ ప్రసాదంపై అవాస్తవాలు ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా తిరుమల శ్రీవారి ప్రతిష్టను పెంచేలా ప్రవర్తిస్తుందని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దేవుడి ప్రతిష్టను మసకబార్చేలా పనిచేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారి అని విమర్శించారు.కూటమి ప్రభుత్వ తీరును రాష్ట్ర ప్రజలు, శ్రీవారి భక్తులు ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని, ఈ ప్రవర్తనపై భక్తులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కాకాణి స్పష్టం చేశారు.
రాజకీయ లబ్ధి కోసం కులాలు, మతాలను వాడుకోవడం సరికాదు, లౌకిక దేశంలో విద్వేష పూరిత ప్రచారాలు తగవని కాకాణి హితవు.
రాజకీయ లబ్ధి కోసం మతాలను, కులాలను వాడుకోవడం కూటమి నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని కాకాణి తీవ్రస్థాయిలో విమర్శించారు. మతం పేరిట వ్యతిరేక ప్రచారాలు చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
మతసామరస్యం....ఎవరు ఏ మతాన్ని ఆచరించినా గౌరవించాలి తప్ప ఆ మతంపై విషం చిమ్మడం, దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. పుట్టుకతో హిందువులమైనప్పటికీ, అన్ని మతాల భక్తి విశ్వాసాలను గౌరవిస్తామని కాకాణి తెలిపారు.తమకు దేవుళ్లందరిపై నమ్మకం ఉందని, చర్చిలకు, మసీదులకు, దేవాలయాలకు… అన్ని ప్రార్థనా మందిరాలకు వెళ్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కోరుకునేది భగవంతుడి కృపాకటాక్షాలే అని వ్యాఖ్యానించారు.
మోక్షానికి మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే....మనిషి నడిచే మార్గాలు, ఆచార వ్యవహారాలు వేరుగా ఉండవచ్చు కానీ, చేరుకోవాల్సిన మోక్షం అనే గమ్యస్థానం ఒక్కటేనని చెప్పారు. ఒకరు ఒక మార్గాన్ని ఎంచుకున్నంత మాత్రాన వారిని తప్పుపట్టడం సరైనది కాదన్నారు.
సెక్యులర్ భావన కాపాడాలి: భారతదేశం ఒక లౌకిక (సెక్యులర్) దేశమని, ఇక్కడ అన్ని కులాలు, మతాల వారు సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని గుర్తుచేశారు. వ్యక్తులకు మతాలను ఆపాదించి రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య చిచ్చు పెట్టడం సమంజసం కాదని కాకాణి హితవు పలికారు.




