Nellore: "ప్రభుత్వ తీరు.. లా అండ్ ఆర్డర్ మీద కాకాణి ఫైర్"
Nellore: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్.
Nellore: "ప్రభుత్వ తీరు.. లా అండ్ ఆర్డర్ మీద కాకాణి ఫైర్"
Nellore: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయంట ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.. లాకప్ డెత్ చేసి.. శవాన్ని కూడా లేకుండా చేస్తున్నారని, సాయి కృష్ణ లాకప్ డెత్, క్రాంతి అనే వ్యక్తి పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు వీడియో విడుదల చేశారని తెలిపారు. ప్రజల్లో పోలీసుల మీద నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతుందని, పోలీసులను చూసి సామాన్య ప్రజలు బయపడుతున్నారని, సాయి కృష్ణ తల్లి ప్రశ్నలకు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పలేకపోతుందని చెప్పారు.
చంపేసి.. బూడిద కూడా మిగలకుండా చేశారని.. ఆ తల్లి కన్నీటికి ప్రభుత్వమే కారణం అని, సాయి కృష్ణ విషయంలో జగన్ స్పందించిన తర్వాత చంద్రబాబులో చలనం వచ్చిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు, సాయి కృష్ణ తల్లి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం సమాధానం
వైసీపీ నేతలను టార్గెట్ చేసిన రెడ్ బుక్.. ఇప్పుడు సామాన్యులను కూడా టార్గెట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు... ఎమ్మెల్యేలు చెబితే కేసులు పెడుతున్నారని, చిత్రహింసలకు గురి చేస్తున్నారు.. ఎమ్మెల్యేలు ఆదేశిస్తే పోలీసులు హత్యలకు కూడా తెగబడుతున్నారని చెప్పారు. ఎన్ని రోజులు జైల్లో ఉండాలో కూడా పోలీసులే డిసైడ్ చేసి.. PT వారెంట్స్ పేరుతో వేధిస్తున్నారని చెప్పారు.
ఈ రెండేళ్ల కాలంలో తన మీద 22 కేసులు పెట్టారని.. సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే కూడా కేసు పెట్టారని చెప్పారు.. అరాచకాలను ప్రశ్నిస్తే కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారని, దాడి చేసిన వారిపై కేసులు పెట్టలేదని ఆయన అన్నారు. అన్నదాత సుఖీభవ మొదట ఏడాది ఎగొట్టారని.. అర్హుల సంఖ్య తగ్గించాలని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి మాట తప్పారని, రైతు ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు.




