Nellore: పేదల భూముల్లో గ్రావెల్ దోపిడీ.. సోమిరెడ్డిపై కాకాణి నిప్పులు

Nellore: సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కనుసన్నల్లోనే గ్రావెల్ దోపిడీ జరుగుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపణ.

V. Narasimhulu, Nellore
Published on: 24 April 2026 9:03 PM IST
Nellore
X

Nellore: పేదల భూముల్లో గ్రావెల్ దోపిడీ.. సోమిరెడ్డిపై కాకాణి నిప్పులు

Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,సర్వేపల్లి నియోజకవర్గం,వెంకటాచలం మండలం, కందలపాడు గ్రామంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాన్ని అన్ని పార్టీ నాయకులు, గ్రామస్తులతో కలిసి పరిశీలించారు మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు"డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి.

"అనుమతులు గోరంత తవ్వకాలు కొండంత"అన్న చందంగా సోమిరెడ్డి నిర్వాకం తయారైంది అన్నారు.. సర్వే నంబర్ 57కు సంబంధించిన పేదల భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరపడం దుర్మార్గం అని, సర్వే నంబర్ 57లోని భూమి దశాబ్దాలుగా నిరుపేదలు సాగు చేసుకుంటున్న భూమి అని చెప్పారు. గతంలోనే వీరికి డి-ఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగిందని, కూటమి నాయకుల ధన దాహంతో పేదలు సాగు చేసుకుంటున్న భూమి గ్రావెల్ రూపంలో తరలిపోతుందని చెప్పారు.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..

2007వ సంవత్సరంలోనే కందల పాడు భూములకు విద్యుత్ సౌకర్యం కల్పించి, రైతులు పంటలు పండించుకున్న ఆధారాలు ఉన్నాయని,2023లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో సుమారు 240 ఎకరాల్లోని 174 ఎకరాల 67 సెంట్ల భూమిని అనాధీనంగా మారుస్తూ, 140 మంది పేదలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ప్రస్తుతం జరుగుతున్న అక్రమ తవ్వకాలపై అధికారులను ప్రశ్నిస్తే, అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల మనోభావాలకు అనుగుణంగానే పనిచేసిందని, గ్రామస్తుల ఆలోచనలకు భిన్నంగా మేము ఏరోజూ వ్యవహరించలేదని,

గతంలో వైయస్సార్ సిపి అడ్డుకున్న గ్రావెల్ మాఫియాతోనే ఇప్పుడు సోమిరెడ్డి ఒప్పందాలు కుదుర్చుకుని, వాటాలు పంచుకుంటూ పేదల కడుపు కొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని,

గతంలో గ్రావెల్ కాంట్రాక్టర్లు అనుమతులు ఉన్నాయని వచ్చినప్పుడు, గ్రామస్థుల మనోభావాలను గౌరవించి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మైనింగ్ జరగకుండా అడ్డుకుందని చెప్పారు. వైఎస్సార్ సీపీ హయాంలో అనుమతులు రాకుండా అడ్డుకుంటే, టీడీపీ హయాంలోనే గతంలో NOCలు ఇచ్చారని చెప్పారు.

ప్రజల భూములను, పశువుల మేత భూములను కాపాడటానికి మేము గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వాచ్‌మెన్ లా పనిచేశామని చెప్పారు. ప్రస్తుత కూటమి పాలకుల అండదండలతోనే గ్రావెల్ కాంట్రాక్టర్ లు బరితెగించి పేదల భూముల్లోకి చొరబడ్డారని, ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ గ్రావెల్ దోపిడీ జరుగుతోందని తెలిపారు.

కందల పాడు భూములు సాగుకు, పశువుల మేతకు ఆధారం , ఇక్కడ మైనింగ్ జరిగితే గ్రామాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వ అండదండలతో జరుగుతున్న ఈ గ్రావెల్ దోపిడీని తక్షణమే నిలిపివేయాలని, లేనిపక్షంలో గ్రామస్థులతో కలిసి పోరాటం ఉధృతం చేస్తాం అని హెచ్చరించారు.

జిల్లాలో కలెక్టర్, ఆర్డీవో, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు ఉన్నారా? , రెవెన్యూ మరియు పోలీస్ వ్యవస్థలు అసలు చేస్తున్నాయా, పని చేస్తుంటే అక్రమ తవ్వకాలు ఎలా సాగుతున్నాయని ప్రశ్నించారు. సర్వేయర్లు అబద్ధపు కొలతలతో పేద రైతుల సాగు భూములను కూడా గ్రావెల్ క్వారీ పరిధిలోకి చేరుస్తున్నారని, మంచి గ్రావెల్ దొరికే ప్రాంతాలను ఆక్రమించేందుకు ప్రతిరోజూ సరిహద్దులను మారుస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన భూమిని లాక్కున్నారని ప్రశ్నించిన ఒక దళిత మహిళను, సి.ఐ. సుబ్బారావు బెదిరించడం దారుణం అని అన్నారు.

కందలపాడు మైనింగ్ ను అడ్డుకుంటే మగవారిపైనే కాదు, మహిళలపై కూడా కేసులు పెడతాం అని సిఐ సుబ్బారావు భయపెట్టడం చూస్తుంటే ఎంత అవినీతిలో కూరుకు పోయాడో అర్థమవుతుందని అన్నారు.

మైనింగ్ శాఖ డీడీ నిద్రలేస్తే అవినీతిలో మునిగితేలుతున్నాడని, పర్యావరణ అనుమతులు లేకుండా, నిర్దేశించిన పరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు‌. ప్రభుత్వం ఉందని విర్రవీగుతున్న అధికారులు, అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న వారు గుర్తుంచుకోవాలని.. వాళ్ళు తిన్న ప్రతి రూపాయిని కక్కించే రోజు వస్తుంది జాగ్రత్త అంటు హెచ్చరించారు.

అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న లారీల నంబర్లను నమోదు చేస్తున్నామని, దీనిపై కలెక్టర్‌తో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చేస్తామని చెప్పారు. పచ్చని చెట్టు కింద నిలబడి సోమిరెడ్డి ని అడుగుతున్నా.... ఈ ప్రాంతానికొచ్చి ఇక్కడ జరుగుతున్న గ్రావెల్ అవినీతిలో సోమిరెడ్డికి గాని వారి కుటుంబ సభ్యులు గానీ కాంట్రాక్టర్ దగ్గర ఒక రూపాయి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయగలడా అని ప్రశ్నించారు.

కూటమి నాయకులు ఇసుక, గ్రావెల్, మట్టి మాత్రమే కాకుండా చివరకు శివాలయం భూములను, సీఎం రిలీఫ్ ఫండ్, సీఎస్ఆర్ నిధులను కూడా వదలకుండా దోచుకుంటున్నారని,

సోమిరెడ్డి పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతిదీ దోపిడీకి గురవుతుందని చెప్పారు. అక్రమ గ్రావెల్ తవ్వకాల వల్ల స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, సాగునీటి పైపులైన్లు పగలగొట్టడం వల్ల మామిడి, నిమ్మ తోటలు ఎండిపోయి, ఓ వృద్ధ రైతు పక్షవాతం బారిన పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి రైతుల భూములను లాక్కోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.

భవిష్యత్ లో అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, కందలపాడులో గ్రావెల్ పై పోరాటం కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదని , తెలుగుదేశం మరియు బిజెపి సానుభూతిపరులు కూడా ఈ అక్రమ తవ్వకాల వల్ల నష్టపోయి మాతో కలిసి వచ్చారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల భూములను కంటికి రెప్పలా కాపాడుకున్నామని చెప్పారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి దారుణంగా తయారైందని, జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాగానే ఈ అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రావెల్ తరలింపునకు సంబంధించి అసలు అనుమతులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని లారీలు తరలించారు? వీటికి సంబంధించిన ఆడిట్ ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం లేదని ప్రశ్నించారు.

గూగుల్ ఫోటోలు తీస్తే కూటమి నాయకులు ఎంత దొంగిలించారో, ఎంత దోపిడీ చేశారో అన్ని లెక్కలు బయటపడతాయని చెప్పారు. టెక్నాలజీ ద్వారా ఏ తేదీన ఎంత భూమి తవ్వారో స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. తాటి చెట్టు లోతు వరకు మట్టిని తవ్వేసి పర్యావరణానికి,ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని అన్నారు. కందలపాడు లో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ మరియు మైనింగ్ అధికారులతో మాట్లాడతా అని అన్నారు .

గతంలో జరిగిన సర్వేపై గ్రామస్థులకు నమ్మకం లేనందున డివిజనల్ సర్వేయర్ చేత తిరిగి రీ-సర్వే చేయించి స్క్రూటినీ చేయిస్తామని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎవరైనా దౌర్జన్యంగా తవ్వకాలు జరపాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

అధికారులు వచ్చి సరైన కొలతలు తీసి, అక్రమాలను నిరూపించే వరకు ఈ సారి గ్రామం నుండి కదిలేది లేదని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం కానీ ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం అని అన్నారు.

సోమిరెడ్డి పేదల పట్ల కనికరం లేకుండా, అబద్ధాలతో కాలక్షేపం చేస్తున్నాడు, నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజం చెప్పడం లేదు అని అన్నారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను, ఫోటోలను సేకరించామని, వీటిని పెన్‌డ్రైవ్‌లో భద్రపరిచి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలకు స్వయంగా అందజేస్తామని తెలిపారు .

అక్రమ మైనింగ్‌ను అడ్డుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని, పెద్ద ఎత్తున తరలివచ్చిన అన్ని పార్టీ నాయకులకు, గ్రామస్తులకు, ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story