Nellore: మంత్రి నారాయణకు మాజీ మంత్రి కాకాణి కౌంటర్

Nellore: నెల్లూరులో మంత్రి నారాయణకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.

V. Narasimhulu, Nellore
Published on: 23 Jun 2026 3:49 PM IST
Nellore
X

Nellore: మంత్రి నారాయణకు మాజీ మంత్రి కాకాణి కౌంటర్

నెల్లూరు: నారాయణ విద్యా సంస్థలో జరుగుతున్న ఆత్మహత్యలు, లోపాలపై అరెస్ట్ చేయాలంటే , మంత్రి నారాయణను రోజుకోసారి అరెస్ట్ చేయాలంటూ.. నెల్లూరులో మంత్రి నారాయణకు మాజీ మంత్రి కాకాణి కౌంటర్ ఇచ్చారు. నారాయణ విద్యా సంస్థలు నిబంధనలకు లోబడి నడుస్తున్నాయా..?

కాలేజీల్లో వసతులు పరిశీలించేందుకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లే దమ్ము మంత్రికి ఉందా..? అంటూ ప్రశ్నించారు. మంత్రి నారాయణ రాజధాని స్కాం లో ముద్దాయి కాబట్టి, ఆయన్ని అప్పట్లో అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. DSC లో లోపాలు ఉన్నాయి కాబట్టి.. MLC చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారని, దానిపై ప్రభుత్వం కక్ష కట్టిందని, MLC చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నిస్తే ఆయన సంస్థలపై దాడులు చేస్తారా.. అని ప్రశ్నించారు.

నిన్న MLC లు చేసిన ఆందోళనతో ప్రభుత్వం ఉలిక్కి పడిందని,జరిగిన డామేజ్ ను కంట్రోల్ చేసేందుకు టీడీపీ నేతలు ఆపసోపాలు పడుతున్నారని అన్నారు. అడ్మిషన్ల సమయంలో కృష్ణ చైతన్య కాలేజ్ మీద యే ఉద్దేశ్యంతో తనిఖీలు చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story