Nellore: శ్రీనివాసులు నాయుడి క్రమశిక్షణ రాజకీయ నేతలకు ఆదర్శం.. కాకాణి
Nellore: నెల్లూరు జిల్లా కావలి మండలం సర్వాయపాలెంలో దివంగత దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు విగ్రహాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు.
Nellore: శ్రీనివాసులు నాయుడి క్రమశిక్షణ రాజకీయ నేతలకు ఆదర్శం.. కాకాణి
Nellore: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి మండలం,సర్వాయపాలెం గ్రామంలో దివంగత దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి.
శ్రీనివాసులు నాయుడు మరణం ఈ ప్రాంతానికి, వారి కుటుంబానికి తీరని లోటని చెప్పారు. ఈ రోజు తాము ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో శ్రీనివాసులు నాయుడు మా మధ్య లేకపోవడం చాలా విచారకరం అని అన్నారు. శ్రీనివాసులు నాయుడు ఉండి ఉంటే ఎంతో హడావిడి చేస్తూ అందరినీ పలకరించేవారని,ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు కాకాణి.
శ్రీనివాసులు నాయుడు ఎంతో మృదుస్వభావి, ఎవరితోనూ కరుకుగా మాట్లాడిన సందర్భాలు లేవని గుర్తు చేశారు.. 2006లో తాను జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న కాలం నుండి వారితో మాకు మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేశారు. శ్రీనివాసులు నాయుడు కేవలం రాజకీయాల్లోనే కాకుండా, విద్యా సంస్థలను నెలకొల్పి ఈ ప్రాంత అభివృద్ధికి, విద్యా వ్యాప్తికి విశేషమైన సేవలు అందించారని కొనియాడారు.
శ్రీనివాసులు నాయుడు ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా వారి కుటుంబ సభ్యులు పనిచేయడం అభినందనీయం అని అన్నారు. శ్రీనివాసులు నాయుడు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని,
శ్రీనివాస నాయుడి జ్ఞాపకాలు ఎప్పటికీ ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని, నెల్లూరు రాజకీయ నాయకుల్లో దామి శెట్టి శ్రీనివాసులు నాయుడు డ్రెస్ సెన్స్, క్రమశిక్షణ ప్రత్యేకమైనవని గుర్తు చేశారు.
ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, సంతోషంలోనైనా శ్రీనివాస నాయుడు ఎప్పుడూ నీట్‌గా, ఫ్రెష్‌గా ఉండేవారని, అదే క్రమశిక్షణ ఆయన రాజకీయ జీవితంలోనూ ప్రతిబింబించిందని చెప్పారు.




