Nellore: వైఎస్‌ఆర్‌సీపీ ర్యాలీ మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు డిమాండ్!
Nellore: నెల్లూరు వీఆర్‌సీ సెంటర్లో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జనసునామీలా మెగా డీఎస్సీ నిరసన ర్యాలీ.
Nellore: వైఎస్‌ఆర్‌సీపీ ర్యాలీ మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు డిమాండ్!
నెలూరు: నెలూరు VRC సెంటర్ లో మెగా డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ.. నారా లోకేష్ రాజీనామా కు డిమాండ్ చేస్తూ.. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన నిరసన ర్యాలీలో ysrcp జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు .
ఈ కార్యక్రమానికి.నెల్లూరు నగర నియోజకవర్గ సమన్వయకర్త కొండ్రెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు, ఇంచార్జిలు, ysrcp నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెగాడీఎస్సీ అవినీతి అక్రమాలపై..విద్యార్థులు యువతతో కలిసి.. పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు..VRC నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు సుమారు 2000 మంది యువత, విద్యార్థులు .. పాల్గొని.. డీయస్సీ అక్రమాలను సిబిఐ విచారణతోపాటుగా .. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మెగా డీఎస్సీ ఉద్యమంతో చంద్రబాబు నాయుడు పీఠం కదిలిపోతుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టే ఈరోజు వైఎస్ఆర్సిపి చేపడుతున్న ఉద్యమానికి ప్రజలు, యువత,విద్యార్థులు, మేధావుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది.. కాబట్టి దీనిపై నారా లోకేష్ రాజీనామా చేయాలని.. సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని..CBI విచారణ జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు.
ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ * రాష్ట్రవ్యాప్తంగా మెగా డీఎస్సీ అక్రమాలపై.. ఉద్యమం ఉధృతమవుతుందని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. గత వారం రోజుల నుంచి.. యువత విద్యార్థులు చేస్తున్న.. అనేక రకాల నిరసన కార్యక్రమాలతో.. మెగా డీఎస్సీ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లిందని తెలిపారు.
సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత అంతటి స్థాయిలో జరుగుతున్న ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది మెగా డీఎస్సీ.. ఉద్యమమేనన్నారు. ఈ ఉద్యమం ద్వారా.. ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం.
డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని.. తప్పుంటే బాధ్యులను శిక్షించాలనే కోరుతున్నామన్నారు. ఎక్కడ డీఎస్సీని రద్దు చేయమని గాని.. ఇప్పుడు ఇచ్చిన టీచర్ ఉద్యోగాలను తీసేయమని గాని..తాము చెప్పడం లేదన్నారు. సిబిఐ విచారణ పారదర్శకంగా జరగాలంటే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. ఎందుకంటే ఇప్పటికే డీఎస్సీ అక్రమాల్లో.. ఆధారాలను ట్యాంపరింగ్ చేశారని.. లోకేష్ అధికారంలో ఉంటే పూర్తిగా ఈ విచారణను తప్పుదారి పట్టించే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఏ పనిలో కూడ పారదర్శకత లేదన్నారు.
ఈరోజు దీనిపై ఉద్యమం చేస్తున్న వైఎస్ఆర్సిపి నేతలపై కేసులు పెడుతున్నారే తప్పు..DSC లో ఎన్నో అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు యువత విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ప్రశ్నిస్తుంటే.. ప్రభుత్వం ఎందుకు విచారణకు వెనకడుగు వేస్తుందో సమాధానం చెప్పాలన్నారు.
ఈరోజు టీచర్ ఉద్యోగాలు వచ్చిన వారిని భయభ్రాంతులను గురిచేసి.. వారిచేత ర్యాలీలు చేయించడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వమే వారిని ప్రోత్సహించి ప్రభుత్వం వారికి బస్సులు ఏర్పాటు చేసి.. ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి ఇలా చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం.
CBI విచారణకు ఆదేశించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే శాసనమండలి సమావేశాల్లో కూడా.. దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




