Nellore: నెల్లూరు విద్యుత్ భవనం ముట్టడి.. పోలీసులకు కాకాణి వార్నింగ్
Nellore: నెల్లూరు విద్యుత్ భవనం ఎదుట వైసీపీ నేతలు భారీ ఆందోళన చేపట్టారు.
Nellore: నెల్లూరు విద్యుత్ భవనం ముట్టడి.. పోలీసులకు కాకాణి వార్నింగ్
నెల్లూరు: పొదలకూరులో వ్యవసాయ రైతు నుంచి విద్యుత్ కలెక్షన్ కోసం ఏఈ లంచం డిమాండ్ చేశారంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం డబ్బులు కట్టినా పనులు చేయడం లేదంటూ కార్యాలయం ఎదుట బైఠాయించారు వైసిపి నాయకులు, కార్యకర్తలు. విద్యుత్ కనెక్షన్ అడిగిన వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ మాజీ మంత్రి కాకాణి ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలపై కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కాకాణి.
నెల్లూరు విద్యుత్ భవన ఎదుట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు మండలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతుల వద్ద అధికారులు ముక్కు పిండి లంచాలు వసూలు చేస్తున్నారంటూ, మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. డబ్బులు తీసుకుని విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కాకాణి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారుల తీరుపై విద్యుత్ భవనం ఎదుట వైసీపీ నేతలు పెద్ద ఎత్తున బైఠాయించారు.
అధికారుల తీరుపై తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం పైన ప్రత్యేకించి పొదలకూరు పోలీసులు పైనా ఆయన నిప్పులు చెరిగారు. రైతులపై అక్రమ కేసులు బనాయిస్తే ఇక చూస్తూ ఊరుకుండబోమంటూ కాకాణి హెచ్చరికలు చేశారు. పోలీసులు పెట్టే కేసులు.. జైళ్లకు తాము భయపడబోమని కాకాణి అన్నారు. పదేపదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పైన కేసులు పెడితే భవిష్యత్తు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన పోలీసులకు హెచ్చరికలు చేశారు.




