Kaligiri: పొగాకు వేలం కేంద్రంలో ప్రమాదం కూలీ అక్కడికక్కడే మృతి!
Kaligiri: నెల్లూరు జిల్లా కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో లారీ లోడింగ్ పనుల్లో ప్రమాదం. పొగాకు చెక్కు పడి ఊపిరాడక రోజువారీ కూలీ శివ కోటారెడ్డి మృతి.
Kaligiri: పొగాకు వేలం కేంద్రంలో ప్రమాదం కూలీ అక్కడికక్కడే మృతి!
Kaligiri: నెల్లూరు జిల్లా కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోజువారీ కూలీగా పనిచేస్తున్న శివ కోటారెడ్డి అనే కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం, వేలంలో కొనుగోలు చేసిన పొగాకు చెక్కులను లారీకి లోడ్ చేసే పనులు పూర్తయిన అనంతరం, వాటిని తాడుతో బిగించే క్రమంలో లారీపై ఉన్న ఒక పొగాకు చెక్కు జారి శివ కోటారెడ్డిపై పడింది. వెంటనే తోటి కూలీలు అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.సమాచారం అందుకున్న కలిగిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో పొగాకు వేలం కేంద్రంలో విషాద ఛాయలు అలుముకోగా, మృతుడి కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు.




