Nellore: కలువాయి చేజర్లలో అకాల వర్షం బీభత్సం నేలరాలిన మామిడి నిమ్మ తోటలు

Nellore: నెల్లూరు జిల్లా కలువాయి, చేజర్ల మండలాల్లో గత రాత్రి కురిసిన అకాల వర్షం, తీవ్ర పెనుగాలులు మెట్ట రైతులను నట్టేట ముంచాయి.

Madhav Goud, Nellore
Published on: 27 May 2026 12:47 PM IST
Nellore
X

Nellore: కలువాయి చేజర్లలో అకాల వర్షం బీభత్సం నేలరాలిన మామిడి నిమ్మ తోటలు

నెల్లూరు: కలువాయి, చేజర్ల మండలాల్లో అకాల వర్షం తీవ్ర పెనుగాలులు దాటికి మామిడి, నిమ్మ తోటలు రైతులు దిగాలు చెందారు,అకాల వర్షాలు,పెనుగాలులు మరోసారి రైతులను నట్టేట ముంచేశాయి. మరి ముఖ్యంగా మామిడి రైతుల ఆశలు నేలరాల్చాయి. నిమ్మ సాగు చేసిన రైతులను పెనుగాలులు తీవ్రంగా దెబ్బతీశాయి. గత రాత్రి 7 గంటల నుంచి మొదలైన ఈదురుగాలులు..స్వల్ప వర్షాలు, పెనుగాలుగా తీవ్ర రూపం దాల్చి, ఎక్కడికక్కడ మామిడి చెట్లు నేలకూలాయి.మామిడి రైతును కోలుకోలేని దెబ్బతీసాయి, గాలుల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మామిడి కాయలు పూర్తిగా నేలరాలిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు విలపిస్తున్నారు. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.దీర్ఘకాల పెట్టుబడులకు ఫలితం లభించబోతుందని భావిస్తున్న నిమ్మ రైతుల ఆశలను పెనుగాలులు భారీ వర్షం నేల కూల్చింది.అన్నింటా పెనుగాలుల దాటికి మెట్ట రైతులు కు భారీ నష్టాలు వాటిల్లయని బాధిత రైతులు వాపోతున్నారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story