Kaluvoya: పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌కు ఘనంగా పదవీ విరమణ సన్మానం!

Kaluvoya: కలువాయి పంచాయతీ కార్యదర్శి సుధాకర్ పదవీ విరమణ సన్మాన వేడుక ఘనం. 32 ఏళ్ల సర్వీసులో 22 ఏళ్లు ఇక్కడే సేవలు అందించడం అదృష్టమన్న సుధాకర్.

Madhav Goud, Nellore
Published on: 2 Aug 2026 6:49 PM IST
Kaluvoya
X

Kaluvoya: పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌కు ఘనంగా పదవీ విరమణ సన్మానం!

కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండల విద్యాశాఖ కార్యాలయంలోని కళావేదికలో కలువాయి పంచాయతీ కార్యదర్శి సుధాకర్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి హాజరై సుధాకర్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, గ్రామ పెద్దలు పాల్గొని ఆయన అందించిన సేవలను కొనియాడారు. అనంతరం పదవీ విరమణ పొందిన సుధాకర్ మాట్లాడుతూ తన 32 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో 22 సంవత్సరాలు కలువాయి ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

ఉద్యోగ జీవితాన్ని కలువాయిలోనే ప్రారంభించి, మళ్లీ అదే ప్రాంతంలో పదవీ విరమణ పొందడం చాలా అరుదైన విషయమని, ఇలాంటి అవకాశం తనకు దక్కడం జీవితాంతం మరచిపోలేని అనుభూతిగా నిలిచిపోతుందని అన్నారు, ,ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుధాకర్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.

Madhav Goud, Nellore

Madhav Goud, Nellore

Next Story