Kaluvoya: ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోండి: కలువాయి ఎస్సై కోటయ్య
Kaluvoya: వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని, డీజేలు, రికార్డింగ్ డ్యాన్సులకు అనుమతి లేదని కలువాయి ఎస్సై కోటయ్య స్పష్టం చేశారు.
Kaluvoya: ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోండి: కలువాయి ఎస్సై కోటయ్య
నెల్లూరు జిల్లా: కలువాయి పోలీస్ స్టేషన్ లో ఎస్సై కోటయ్య వినాయక చవితి సందర్భంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు,ముందుగా మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పండుగ ప్రశాంత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా నిర్వాహకులు జరుపుకోవాలని చూచించారు, విగ్రహం ఏర్పాటు కు అనుమతి తప్పని సరిగా తీసుకోవాలన్నారు, లౌడ్ స్పీకర్లు ఉదయం 6 నుండి సాయంత్రం 7 వరకు మాత్రమే వినియోగించాలని, వివాద రహిత స్థలాల్లో మాత్రమే విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు.
విగ్రహాల వద్ద ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబందించిన పాటలు పెట్టిన ఎడల కమిటీ సభ్యులందరిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. డీజే, పాఠకచేరి, డాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడానికి అనుమతులు లేవన్నారు, అలా ఏర్పాటు చేస్తే వారిపై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.




