Kavali: డిఎస్పీకి ఫిర్యాదు చేసిన తెదేపా నాయకుడు వడ్డే శ్రీకాంత్ నాయుడు
Kavali: సామాజిక మాధ్యమాల్లో కుటుంబంపై అసత్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కావలి డిఎస్పీ వివి రమణ కుమార్‌కు ఫిర్యాదు చేసిన తెదేపా నేత వడ్డే శ్రీకాంత్ నాయుడు.
Kavali: డిఎస్పీకి ఫిర్యాదు చేసిన తెదేపా నాయకుడు వడ్డే శ్రీకాంత్ నాయుడు
కావాలి: సోషల్ మీడియాలో తమ కుటుంబం పై అసత్య, అభ్యంతర, అమర్యాదుగా పోస్టులు పెట్టి తమ పైనే తప్పుడు అభియోగాలు చేస్తున్న మాలెపాటి రవీంద్రనాయుడు, మాలెపాటి లోకేష్, మాలెపాటి సుధాకర్ రావు, కంచర్ల సునీల్ కుమార్ వ్యవహార తీరును తప్పుబడుతూ తప్పుడు పోస్టులు పెట్టిన పెట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్డే శ్రీకాంత్ నాయుడు శుక్రవారంన కావలి డి.ఎస్.పి వివి రమణ కుమార్ ని శుక్రవారం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం డిఎస్పి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ...
ఆగస్టు 15వ తేదీ మాలెపాటి రవీంద్ర నాయుడు వద్ద పనిచేసే పూరిమెట్ల మనోహర్ అనే వ్యక్తి చేత సిబిఎన్ ఆర్మీ అనే వాట్సాప్ గ్రూపులో తనపై తన కుటుంబం పై మరియు ముఖ్యంగా కుటుంబంలోనే మహిళలను కించపరిచేలా అసత్య, అభ్యంతరకర,అమర్యాదగా రెండు పోస్ట్లు పెట్టిన విషయంపై ఈ నెల 15వ తేదీన శనివారం న దగదర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
అనంతరం ఫిర్యాదు పై తేదీ :17/8/26 న సోమవారం న తన కుటుంబం పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ వాస్తవ ఫిర్యాదును తప్పుదోవ పట్టించి మాలె పాటి లోకేష్ ఆధ్వర్యంలో కావలి డిఎస్పీ గారిని కలిసి అసత్యాలు వల్లి వేయడం జరిగిందన్నారు. జరగనివి జరిగినట్లు చూపించి వాస్తవాలు బయటికి రానికుండా అడ్డుకోవాలని తప్పుడు ఫిర్యాదులు చేశారన్నారు.
ఈ విషయాలన్నిటిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి తమ కుటుంబం పై అభ్యంతరకర,అసత్య పోస్టులు పెట్టిన పెట్టించిన వారందరపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కావలి డిఎస్పీ ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 2025 డిసెంబర్ 10వ తేదీన మాలపాటి రవీంద్ర నాయుడు, మలెపాటి లోకేష్, కంచర్ల సునీల్ కుమార్ తో పాటు పలువురు కలిసి సుఫారీ గ్యాంగ్ ద్వారా నన్ను హత్య చేయాలని చూశారన్నారు.
2025 సంవత్సరం ఆగస్టు నెలలో దగదర్తి గ్రామంలో తమ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న హోటల్ పై దాడి చేయించింది మాలెపాటి రవీంద్రనాయుడు, మాలెపాటి లోకేష్, మాలెపాటి సుధాకర్ రావు, కంచర్ల సునీల్ కుమార్ లె అని దిగబట్టారు. 2026 జనవరి 5 వ తేదీ అర్ధరాత్రి దగదర్తి యూనిట్ ఇంచార్జ్ అయిన కడియాల వెంకట సురేష్ ఇంటిపై మాలేపాటి సుధాకర్ రావు ఆధ్వర్యంలో 60 మంది మూకుమ్మడిగా దాడి చేసి విచక్షణ రహితంగా వేట కత్తులతో వెంకట సురేష్ పై విచక్షణ రహితంగా నరకడంతో పాటు, ఇంటిని ఇంట్లోని గృహపగల వస్తువులను పూర్తిగా ధ్వంసం చేసి, ఒక భయానక వాతావరణాన్ని దగదర్తి లో సృష్టించింది మీరు కాదా అని ప్రశ్నించారు, ప్రభుత్వ పలు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే భాగంలో వేసిన శిలాఫలకాలు ధ్వంసం చేయించింది మీరు కదా అన్నారు.
పార్టీకి వ్యతిరేకంగా వారి వ్యక్తిగత ఎజెండాతో దగదర్తి లో మాలపాటి కుటుంబం పనిచేస్తుందని దుయ్యబట్టారు.మాలెపాటి కుటుంబానికి కొంతమంది షాడో నాయకుల అండదండలు ఉన్నాయని తమ కుటుంబానికి అటువంటి వారు ఎవరూ లేరని తమ కుటుంబానికి గాడ్, గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు,లోకేష్ అన్నా అన్నారు పార్టీ అధిష్టానాన్ని అలపాటి కుటుంబం జరగనివి జరిగినట్టు చూపించి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పాల వెంకటేశ్వర్లు, వింజం సురేష్, వింజం వెంకటేశ్వర్లు, కొల్లి అంకయ్య, కన్నం వెంకటేశ్వర్లు, మధ్యన కిషోర్, చౌటూరి సుధీర్, పైడి వెంకట రమణయ్య, కడియాల వెంకట సురేష్, చల్ల అవినాష్ చౌదరి, ముప్పాళ్ళ తరుణ్, మార్పుడి అనిల్, బొందు మని, పైడి అశోక్, కుందుర్తి సీనయ్య, చీకటి తిరపతి, తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




