Kodurupadu: కోడూరుపాడులో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం!
Kodurupadu: నెల్లూరు రూరల్ కోడూరుపాడులో రూ.1.46 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 8.0 ఎంవీఏ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను టీడీపీ నేతలు ప్రారంభించారు.
Kodurupadu: కోడూరుపాడులో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభం!
Kodurupadu: నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 1వ డివిజన్ కోడూరుపాడు విద్యుత్ సబ్ స్టేషన్ నందు 1కోటి 46లక్షల రూపాయల వ్యయంతో 8.0 MVA ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం కమిటీ మెంబర్ పురిణి సరస్వతి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు సీనియర్ టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి.
ఈ నూతన 8.0 MVA ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం వలన 1వ డివిజన్ పరిధిలోని కోడూరుపాడు, దొరతోపు కాలనీ, కల్తీ కాలనీ, గమళ్ళపాలెం ప్రాంతాలలో ప్రజలకు నాణ్యమైన మరియు నిర్విరామమైన విద్యుత్ అందుతుంది.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి... 1వ డివిజన్ అంటే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎప్పుడూ ప్రత్యేక అభిమానం అని....
గత 3 ఎన్నికల్లో 1వ డివిజన్ ప్రజలు కోడూరు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదరించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1వ డివిజన్ అభివృద్ధికి 13కోట్ల 60లక్షల రూపాయలు నిధులు కేటాయించామని, రాబోయే 3 సంవత్సరాలలో 1వ డివిజన్ ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి...
పై కార్యక్రమంలో కోడూరుపాడు PACS సొసైటీ ఛైర్మెన్ గంగి జయరామి రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ కుడుములు చిరంజీవి, కో క్లస్టర్ ఇంచార్జ్ తమ్మి శ్రీనివాసులు, 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు షేక్ జావీద్, టీడీపీ నాయకులు రాచూరి జానకిరామయ్య, యనమల హరి యాదవ్, కంటేపల్లి శీనయ్య, షేక్ జబ్బార్, తమ్మి శీను, తమ్మి వెంకట రమణయ్య, శ్రీనివాసులు, యేసుపోగు ప్రసాద్, శశి, షరీఫ్, బాబు తదితరులు పాల్గొన్నారు.




