Nellore: ఈనెల 6న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పనులకు శంకుస్థాపన!

Nellore: నరసింహకొండ ఆలయ అభివృద్ధికి రూ 8.75 కోట్ల నిధులు ఈనెల 6న శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 4 Sept 2026 5:23 PM IST
Nellore
X

Nellore: ఈనెల 6న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పనులకు శంకుస్థాపన!

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం నందు ఈ నెల 6వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు 8 కోట్ల 75 లక్షల రూపాయలతో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతులమీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని, కావున నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావలసిందిగా కోరుచున్నామని అన్నారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి ఫలితంగా నరసింహకొండ అభివృద్ధికి రూ.8 కోట్ల 75 లక్షల నిధులు మంజూరు కావడం హర్షణీయం అని అన్నారు.

శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసి, భక్తులు మరియు పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి, భక్తులు మరియు నెల్లూరు రూరల్ ప్రజలు పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికాంలోకి వచ్చాక ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుందని, శ్రీ వేదగిరి లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ గ్రీవెన్స్ సెల్ ఇంచార్జ్ మంగళపూడి భాస్కర్ రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కమిటీ సభ్యులు బెలుమ్ శ్రీనివాసులు రెడ్డి, సింహాద్రి నాయుడు, తోడేటి మురళి, దబ్బుగుంట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story