Nellore: దేవరపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి
Nellore: నెల్లూరు రూరల్ దేవరపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గిరిధర్ రెడ్డి పిలుపు.
Nellore: దేవరపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన గిరిధర్ రెడ్డి
నెల్లూరు: నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో దేవరపాలెం గ్రామంలో ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. గత 2 సంవత్సరాల కాలంలో ఇంత మంచి చేసిన కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడండి అంటూ పిలుపునిచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సహకారంతో, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు.. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమం రెండూ రెండు కళ్ళులా సాగుతున్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి,మాజీ సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి, టీడీపీ నాయకులు కుర్రా పద్మాకర్ రెడ్డి, కుర్రా శ్రీనివాసులు రెడ్డి, ముత్యంశెట్టి శ్రీనివాసులు, నాతా వెంకటేశ్వర్లు, ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి, తాటిపర్తి వెంకటేష్, సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.




