Nellore: కల్యాణ్ నగర్‌లో రూ.1 కోటితో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన!

Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం 23వ డివిజన్ కల్యాణ్ నగర్‌లో రూ.1 కోటి వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన జరిగింది.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 18 Aug 2026 6:12 PM IST
Nellore
X

Nellore: కల్యాణ్ నగర్‌లో రూ.1 కోటితో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన!

నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 23వ డివిజన్ కల్యాణ్ నగర్ నందు 1కోటి రూపాయలతో సి.సి. డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు స్థానిక కార్పొరేటర్ దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 23వ డివిజన్ అభివృద్ధికి 11 కోట్ల 11 లక్షల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో 857 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు.

భారీ వర్షాలు కురిసినప్పుడు ఎగువ ప్రాంతాలనుండి వచ్చు వర్షపు నీరు వెళ్లేందుకు అవుట్ ఫ్లో డ్రైన్ లేక అనేక సంవత్సరాలుగా తాత్కాలిక పనులు చేప్పటం జరిగిందని, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని శాశ్వత పరిష్కారం కోసం అవుట్ ఫ్లో డ్రైన్ ను మంజూరు చేయించారు. అయితే ఇప్పటికే కొంత భాగం పనులు పూర్తిచేయడం జరిగిందని, మిగిలిన పనులు శంకుస్థాపన చేయడం జరిగిందని, అతి త్వరలో ఈ పనులు పూర్తిచేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోరారు.

పై కార్యక్రమంలో 23వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేకల మధు, టీడీపీ నాయకులు పామూరు సుధాకర్ రెడ్డి, పుల్లా రెడ్డి, నన్నం శ్రీను, బాబుజీ, మనోహర్ రెడ్డి, పామూరు శ్రీనివాసులు రెడ్డి, గోపాల్ రెడ్డి, మురళి రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, రామచంద్రయ్య, శికారి భాస్కర్, డి.ఆర్. వెంకటేశ్వర్లు, రమణయ్య, చైతన్య, అబ్బు వెంకటేశ్వర్లు, వెంకట రమణయ్య, చంద్ర, బ్రహ్మదేవి, సుబ్బా రెడ్డి, కేశవులు, పాలేటి శివ, ప్రేమ్ కుమార్, అంకయ్య, రబ్బాని, మోదేపల్లి శివ, కాకు వెంకటేశ్వర్లు, బత్తల శివ, కబీర్, బాలు, మమతా రెడ్డి, మాధవి మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొనారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story