Nellore: నెల్లూరు రూరల్‌లో వైభవంగా వరుణ యాగం.. పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి!
Nellore: సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వరుణ యాగం. నిర్వహించిన టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
Nellore: నెల్లూరు రూరల్‌లో వైభవంగా వరుణ యాగం.. పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రిమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో వేద పండితులు ప్రత్యేక పూజలు, వరుణ హోమ కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సంతోషంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగిందని చెప్పారు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల సంక్షేమం, రాష్ట్ర సుభిక్షం కోసం వరుణ యాగం నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రకృతి అనుకూలించి సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని కూటమి నాయకులందరం కలిసి ప్రార్ధించడం జరిగిందని చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ దోడ్డపనేని రాజా నాయుడు,కో క్లస్టర్ ఇంచార్జ్ మమతా రెడ్డి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఏలూరు శిరీష, 28వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు చెక్క సాయి సునీల్, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులు గజరా నరేష్, రాఘవేంద్ర, దొరబాబు, పెంచలయ్య, చంటి, నాగమణి, రాధా కుమారి, తేజ, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు తోట శోభారాణి టిడిపి నాయకులు రఘురామ్, మునిశేఖర్ నాయుడు, దామోదర్, మేఘనాథ్ సింగ్, ఆకుల రాజేష్, తదితరులు పాల్గొన్నారు.




