Nellore: బాలయ్య ఆరోగ్యం కోసం పొర్లుదండాలు పెట్టిన NUDA చైర్మన్
Nellore: హీరో బాలకృష్ణ శస్త్రచికిత్స విజయవంతం కావాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో పొర్లుదండాలు పెట్టారు.
Nellore: బాలయ్య ఆరోగ్యం కోసం పొర్లుదండాలు పెట్టిన NUDA చైర్మన్
నెల్లూరు: ప్రముఖ సినీ హీరో... హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు బాలకృష్ణ అనుచరుడు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. మొన్న కాకినాడ వద్ద షూటింగ్ చేస్తుండగా బాలకృష్ణ అదుపుతప్పి పడిపోవడంతో, కాలి మడమకు గాయమైందట. దాంతో బాలకృష్ణ మడమకు ఇవాళ హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ లో శాస్త్ర చికిత్స చేస్తున్నారట.
శస్త్ర చికిత్స విజయవంతంగా జరగాలి... హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోగ్యం బాగుండాలంటూ... నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ సీనియర్ పొలిటీషియన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. నెల్లూరులోని శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో పొర్లు దండాలు పెట్టారు... బాలకృష్ణకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, తలెత్తకూడదు అంటూ.. నెల్లూరు మూలస్థానేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ ప్రాంగణంలో పొర్లు దండాలు పెట్టారు. తాను దైవంగా భావించే ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ ఆరోగ్యం బాగుండాలని, అందుకు శ్రీ మూలస్థానేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
ఇటీవల కాకినాడ పోర్టు వద్ద సినిమా షూటింగ్లో రియల్ ఫైటు డూప్ లేకుండా ఫైట్ చేస్తున్న సమయాన, కాలు మడమకు గాయమైందని, ఇవాళ హైదరాబాదులోని ఏఐజీ హాస్పిటల్ లో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారట. బాలకృష్ణ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు అంటూ మూలస్థానే శ్వరుడి ఆశీస్సులు బాలకృష్ణ కు ఉండాలని కోరుతూ.. శ్రీనివాసులు రెడ్డి ఇలా ప్రత్యేక పొర్లు దండాలతో భక్తి చాటుకున్నారు.




