Nellore: వైసీపీ నేతలు డ్రామాలు ఆపి అభివృద్ధికి సహకరించాలి!

Nellore: వైసీపీ నేతలు డ్రామాలు ఆపాలి క్రెడిట్ చోరీ అని మాట్లాడటం హాస్యాస్పదమంటూ మండిపడ్డ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

A Praveen, Nellore
Published on: 1 Sept 2026 4:14 PM IST
Nellore
X

Nellore: వైసీపీ నేతలు డ్రామాలు ఆపి అభివృద్ధికి సహకరించాలి!

Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఐదేళ్ల వైసీపీ ప్రజావ్యతిరేక పరిపాలన వల్ల రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేశారు. కూటమి గెలుపు, జగన్ ఓటమి చారిత్రాత్మకం. ఓటమి పాలయ్యాక ఎందుకు ఒడిపోయాం, కారణాలేంటి చూసుకోవట్లేదు.

ఎంతసేపు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, ఇబ్బందులు పెట్టాలి, పెట్టుబడిదారులను బెదిరించడం చేస్తున్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ ధర్మంపై వైసీపీకి ఎక్కడా లేని ప్రేమ పుట్టింది ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, రధం దగ్ధం, విగ్రహాలు మాయమైనప్పుడు ఏమయ్యారు వైసీపీ నేతలు.

క్రెడిట్ చోరీ అని హాస్యాస్పదంగా వైసిపి నేతలు మాట్లాడుతున్నారు. నాగార్జున సాగర్, సోమశిల, తెలుగుగంగ కట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి అని అనేలా ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది కూడా జగన్ అని అంటారు. డ్రామాలు ఆపి రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి.

A Praveen, Nellore

A Praveen, Nellore

Next Story