Nellore: సామాన్యుడి ప్రశ్నకు స్పందించి.. ఆసుపత్రికి వెళ్లిన కోటంరెడ్డి!

Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన "నన్ను ప్రశ్నించవచ్చు" కార్యక్రమానికి అనూహ్య స్పందన.

V. Narasimhulu, Nellore
Published on: 31 May 2026 8:01 AM IST
Nellore
X

Nellore: సామాన్యుడి ప్రశ్నకు స్పందించి.. ఆసుపత్రికి వెళ్లిన కోటంరెడ్డి!

Nellore: నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన నన్ను ప్రశ్నించవచ్చు అనే వినూత్న కార్యక్రమం నేడు కార్యరూపం దాల్చింది. "నన్ను ప్రశ్నించవచ్చు" అనే నా కార్యక్రమానికి స్పందించి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన మల్లెల శ్రీహరి అనే వ్యక్తి జిల్లా ప్రభుత్వ వైద్యశాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా నేడు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సందర్శించారు.

గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను ఆదర్శంగా తీసుకొని నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. జిల్లా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, జిల్లా కలెక్టర్ అందరం కలసి పనిచేసి, 6 నెలల్లో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలను అభివృద్ధి పధంలో తీసుకుకొనివస్తామని అన్నారు. యువతలో ప్రశ్నించేతత్వం పెరగాలని, సలహాలను, సూచలను అందిస్తే, స్థానిక శాసనసభ్యుడిగా పరిగణలోకి తీసుకుంటానని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story