Podalakur: స్టేడియం అభివృద్ధి, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు నుడా శ్రీకారం
Podalakur: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి సూచనల మేరకు పొదలకూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు నుడా చైర్మన్ కోటంరెడ్డి తెలిపారు.
Podalakur: స్టేడియం అభివృద్ధి, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు నుడా శ్రీకారం
Podalakur: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు పొదలకూరు పట్టణంలో రూ 1.25 కోట్లతో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు పట్టణంలోని స్టేడియం మరియు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని మంగళవారం టిడిపి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొదలకూరు పట్టణంలో సంఘం రోడ్డు సెంటర్ నుంచి రాంనగర్ సెంటర్లోని నువ్వుల వెంకటరత్నం నాయుడు విగ్రహం వరకు దాదాపు ఒక కిలోమీటర్ పైన త్వరలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం సుమారు రూ.1.25 కోట్లు ఖర్చవుతుందని త్వరలోనే పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని నుడా అధికారులకు సూచనలు చేశారు.
సెంట్రల్ లైటింగ్ మధ్యలో డివైడర్లు, ఆహ్లాదకరంగా పూల మొక్కలు ఏర్పాటు చేసి పొదలకూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే పట్టణంలోని స్టేడియంలో క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా లే అవుట్లలోని పబ్లిక్ పర్పస్ స్థలాలను ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




