Nellore: పదవీకాలం ముగిసిన వేళ.. పోతిరెడ్డిపాలెంలో వైఎస్సార్సీపీ నేతల సందడి!

Nellore: నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీకాలం ముగిసిన సందర్భంగా ఘన సన్మానం నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 8:49 AM IST
Nellore
X

Nellore: పదవీకాలం ముగిసిన వేళ.. పోతిరెడ్డిపాలెంలో వైఎస్సార్సీపీ నేతల సందడి!

Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో వైఎస్సార్సీపీ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచులు, వార్డ్ మెంబర్లకు ఘన సత్కారం నిర్వహించారు. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో వైఎస్సార్సీపీ పార్టీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సర్పంచులు, వార్డ్ మెంబర్లకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు.

కోవూరు మండలంలోని వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచులు, వార్డ్ మెంబర్లందరినీ ఈ సందర్భంగా గౌరవించారు. కార్యక్రమంలో వీరీ చలపతిరావు, కొండూరు అనిల్ కుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story