Nellore: చిన్నారుల మధ్య ఘనంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు!

Nellore: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో పాఠశాల విద్యార్థులు, చిన్నారుల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

A Praveen, Nellore
Published on: 22 Nov 2026 3:33 PM IST
Nellore
X

Nellore: చిన్నారుల మధ్య ఘనంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు!

నెల్లూరు: కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఆదివారం నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి గులాబీ పూలు అందజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

చిన్నారుల ఆత్మీయ పలకరింపులు, శుభాకాంక్షల మధ్య ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు వారితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం చిన్నారులందరికీ స్వయంగా కేక్ పంచిపెట్టారు. వారితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ చదువు, పాఠశాల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే చూపిన ఆప్యాయతతో చిన్నారులు ఆనందోత్సాహాలతో గడిపారు.

వీపీఆర్ నివాసం చిన్నారుల సందడి, కేరింతలతో పండుగ వాతావరణాన్ని తలపించింది.

A Praveen, Nellore

A Praveen, Nellore