Nellore: కూటమి ప్రభుత్వంపై నల్లపరెడ్డి తీవ్ర విమర్శలు!
Nellore: కోవూరు నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.
Nellore: కూటమి ప్రభుత్వంపై నల్లపరెడ్డి తీవ్ర విమర్శలు!
Nellore: నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌ను బలోపేతం చేయడంపై నాయకులకు దిశ నిర్దేశం చేశారు.
ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, కౌన్సిలర్, కార్పొరేటర్ పదవులకు పోటీకి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికీ సక్రమంగా అందాయని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమం కూడా పూర్తిగా జరగటం లేదన్నారు.
ఎన్నికల హామీలు అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఈ 27 నెలల్లో 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని, పోలీస్ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు.
వైసీపీ నాయకులు అందరూ ఏకతాటిపై నిలబడి చిన్న చిన్న మనస్పర్థలను పక్కన పెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుచ్చిమున్సిపాలిటీ, జడ్పీటీసీ, మండల ప్రజా పరిషత్‌లను, పంచాయతి ఎన్నికలు అన్నింటినీ భారీ మెజారిటీతో గెలుచుకోవాలని, కోవూరు నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, మండల కన్వీనర్ అనూప్ రెడ్డి,శివుని నరసింహులు రెడ్డి,బుచ్చి మండల కన్వీనర్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు.




