Kovvur: ఫోర్త్ ఎస్టేట్ సీఈఓ అరెస్ట్.. విపిఆర్‌పై అనిల్ కుమార్ ఫైర్
Kovvur: ఫోర్త్ ఎస్టేట్ సీఈఓ శ్రవణ్ అరెస్ట్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం. కోవూరు పిఎస్ వద్ద వైసిపి శ్రేణులతో కలిసి విపిఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
Kovvur: ఫోర్త్ ఎస్టేట్ సీఈఓ అరెస్ట్.. విపిఆర్‌పై అనిల్ కుమార్ ఫైర్
కోవూరు: మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కాస్త మరింత ముదురుతోంది.. ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ సీఈఓ శ్రవణ్ అరెస్టుతో.. జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. శ్రవణ్ అరెస్టు వివరాలు తెలుసుకునేందుకు కోవూరు పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి వైసిపి నేత డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ రావడంతో.. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ....మైనింగ్ లో జరుగుతున్న అవినీతిపై విపిఆర్ ను, ఆధారాలతో సహా చూపిస్తూ... తాను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక చంచాలతో మాట్లాడిస్తారా..? అంటూ మండిపడ్డారు... వి పి ఆర్ దంపతుల పై... ఫోర్త్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ లో వార్తలు ప్రసారం చేస్తే తప్పుడు కేసులు పెట్టారని,
కోవూరు లోని రవికుమార్ అనే కాంట్రాక్టర్ ని ఐదు లక్షల రూపాయల డిమాండ్ చేశారని ఆరోపణలతో తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విపిఆర్ దంపతులు జిల్లాలో అరాచకాలు సృష్టిస్తున్నారని, ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో భయపెట్టేలా రాజకీయ కుట్రలు పన్నుతున్నారని అన్నారు... మీరు రాజకీయాల్లో కి రాకముందు మీరు చేసిన అరాచకాలు చరిత్రని బయట పెడితే తట్టుకోలేరని హెచ్చరించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.




