Kodavaluru: పోలీసులకు 3 బొలెరో వాహనాలు అందజేసిన ఎమ్మెల్యే!

Kodavaluru: కోవూరు నియోజకవర్గ పోలీసులకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రూ.40 లక్షల విలువైన 3 బొలెరో వాహనాలు అందజేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Aug 2026 12:47 PM IST
Kodavaluru
X

Kodavaluru: పోలీసులకు 3 బొలెరో వాహనాలు అందజేసిన ఎమ్మెల్యే!

Kodavaluru: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో విపిఆర్ ఫౌండేషన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల కు మూడు బొలెరో వాహనంలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగినది. కోవూరు నియోజకవర్గంలో గతంలో మూడు వాహనాలు ఇచ్చామని ప్రస్తుతం సుమారు 40 లక్షల వ్యయంతో మరో మూడు వాహనాలు అందజేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.

కోవూరు నియోజకవర్గంలోని పోలీస్ సిబ్బందికి ఎలాంటి పక్షపాతం లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖను ఆదేశించామని ఆమె అన్నారు. ప్రస్తుతం ఉన్న వాహనాల వల్ల అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎక్కువ సమయం పడుతున్నందువల్ల ఈ వాహనాలు ఇస్తున్నట్టు ఆమె తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, వీరేంద్ర చౌదరి, కొడవలూరు మండల అధ్యక్షులు నాప వెంకటేశ్వర్లు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story