Nellore: వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫైర్
Nellore: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Nellore: వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫైర్
Nellore: ఏపీ హోమ్ మంత్రి అనిత పై వైసీపీ మాజీ మంత్రి, అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మేకప్పుల గురించి మాట్లాడడం.. వ్యక్తిత్వ హననం చేయడం సరికాదని, ఇంట్లో తల్లి ,భార్య, కుమార్తె, చెల్లె ఉన్నారనే విషయం మర్చిపోతున్నారని మండిపడ్డారు.
దేశ మహిళలందర్నీ ఆత్మవిశ్వాసంతో రాజకీయాల్లో పాల్గొనండి అంటూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు లు పిలుపునిస్తుంటే. వైసీపీ నేతలు మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
డైరెక్టుగా తమను ఎదుర్కోలేకనే వైసీపీ నేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, మాజీ మంత్రినని చెప్పుకునే నేత , తనపై తీవ్ర ఆరోపణలు చేశారని దుర్భాషలాడరని అన్నారు. మహిళలకి 33 శాతం రిజర్వేషన్ రాబోతున్న తరుణంలో.
మహిళలను కించపరిచేలా వైసీపీ వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విమర్శించారు.




