Guduru: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పౌష్టికాహారం పంపిణీ!
Guduru: నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు, బాలింతలకు కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ. ముఖ్య అతిథి డాక్టర్ షరీనా చేతుల మీదుగా అందజేత.
Guduru: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పౌష్టికాహారం పంపిణీ!
Guduru: నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు కి రోగులకు కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధరంలో సభ్యుల సహకారంతో అలాగే ఈరోజు" ముఖ్య అతిథిగా డాక్టర్ షరీనా " చేతులమీదుగా బ్రెడ్,బిస్కెట్లు,వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.
ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ మా కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల యొక్క సొంత నిధులతో వెచ్చించి ప్రతి నెల మొదటి వారంలో గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న పేషెంట్లకు బిస్కెట్లు,వాటర్ బాటిల్స్ ప్రతి నెల క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్న కార్యక్రమం మా ట్రస్ట్ సభ్యులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేశారు.
దాదాపు 100 మంది రోగులకు బిస్కెట్లు మరియు బ్రెడ్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు అలాగే మా ట్రస్టు ద్వారా మేము చేస్తున్న సేవా గుర్తించి మా వంతు ఈ చిన్న కార్యక్రమాలు కి ఈ దాతలు" దారా మోహన్ బిందు "గారు సహాయ సహకారాలతో కలిపి ట్రస్టు సభ్యులు సొంత నిధులతో జతచేసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అలాగే మా ట్రస్టు ఎక్కడ నిరుపేదలు ఉంటారో అక్కడ మా ట్రస్ట్ ఉంటుందని తెలియజేశారు.
ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ షరీనా కి మా కృప సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు,చవల సురేంద్ర, పేయ్యల రమణయ్య పిరమిటి చెంచయ్య, కోడి శివ, హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




