Naidupeta: కూచివాడలో ఉపాధి పనులు కరువు అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం!

Naidupeta: తిరుపతి జిల్లా కూచివాడలో రెండేళ్లుగా ఉపాధి పనులు బంద్. నడిచి వెళ్లినా కూలి దొరకట్లేదని ఆవేదన; వీలైనంత త్వరగా పనులు కల్పిస్తామని ఎంపీడీవో బాలాజీ హామీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 July 2026 1:34 PM IST
Naidupeta
X

Naidupeta: కూచివాడలో ఉపాధి పనులు కరువు అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం!

Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కూచివాడ గ్రామంలో ఆ గ్రామ ప్రజలు అధికారులు నాయకుల తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, తమ గ్రామములో గత రెండు సంవత్సరాలుగా విబిజి రాంజీ పనులు ఏర్పాటు చేయక గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని అధికారుల నిర్లక్ష్యంతోనే తమకు వి బి జి రాంజీ పనులు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారని మా గ్రామంలో అయితే సామాన్య ప్రజలు ఈ పనులు లేక వేరే పనులకు వెళ్లాలంటే 14 కిలోమీటర్లు నాయుడుపేటకు చేరుకొని కూలి పనులకు వెళ్లాలని అక్కడికి వెళ్లేసరికి సమయం సరిపోక కనీసం కూలి పనులు కూడా దొరకట్లేదని ఆ గ్రామస్తులు తెలియజేస్తున్నారు,

ఆ గ్రామం పరిశీలించడానికి వెళ్లిన నాయుడుపేట ఎంపీడీవో బాలాజీ కు ఆ గ్రామస్తులు వారి ఆవేదనను తెలియజేశారు, గత రెండేళ్లుగా మా గ్రామంలో వి బి జి రామ్ జి పనులను ఏర్పాటు చేయలేదని అందుకు తమకు ఆర్థికంగా అనేక ఇబ్బందులు కు గురవుతున్నామని ఇప్పటికైనా తమ ఇబ్బందులను గుర్తించి వి బి జి రాంజీ పనులను మా గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయనకు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో బాలాజీ మాట్లాడుతూ కచ్చితంగా ఈ గ్రామస్తులకు వి బి జి రాంజీ పనులను అందుబాటులోకి తీసుకొస్తామని ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఈ పనులను మీకు అందుబాటులోకి తీసుకురాలేదు పరిశీలిస్తామని కచ్చితంగా అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఈ పనులను కూచివాడ గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకొచ్చి వారి ఇబ్బందులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story