Kaligiri: కుడుములదిన్నెపాడులో పిచ్చికుక్క బీభత్సం.. 15 మందికి గాయాలు!
Kaligiri: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కుడుములదిన్నెపాడులో పిచ్చికుక్క దాడి. 15 మందికి తీవ్ర గాయాలు, వింజమూరు ఆస్పత్రికి తరలింపు.
Kaligiri: కుడుములదిన్నెపాడులో పిచ్చికుక్క బీభత్సం.. 15 మందికి గాయాలు!
Kaligiri: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కుడుములదిన్నెపాడు గ్రామంలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున ప్రధాన రహదారిపై టీ బంకు వద్దకు వచ్చిన గ్రామస్తులపై ఒక్కసారిగా దాడి చేసిన పిచ్చికుక్క.. కనిపించిన వారినల్లా కరిచింది.ఈ ఘటనలో సుమారు 15 మంది గాయపడినట్లు సమాచారం.
కుక్క దాడిలో గాయపడిన బాధితులు తీవ్ర భయాందోళనకు గురై హుటాహుటిన వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు.వైద్యులు వారికి ప్రాథమిక చికిత్స అందించి అవసరమైన వైద్య సూచనలు చేశారు.కాగా,గ్రామంలో కొంతకాలంగా వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
కుక్కల నియంత్రణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పిచ్చికుక్కలను పట్టుకుని, గ్రామంలో కుక్కల బెడదను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.




